AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..

www.mannamweb.com


AP Pension Scheme: ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్‌ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది. ఆ డబ్బులను జూలై 1న వారి ఖాతాల్లో జమా చేయనున్నారు. అంటే ఒక్కొక్కరికి రూ. 7 వేలు వృద్ధాప్య ఫించను పొందనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతోపాటు కొత్త పాసు పుస్తకాలను సైతం ఫించనుతో పాటు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ. 6 వేలు పెంచుతామని హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పెరిగిన పెన్షన్లను జూలై 1 నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది ఫించను లబ్దిదారులు ఉన్నారు. దీనికి ప్రభుత్వం 1,939 కోట్లు ఇప్పటి వరకు చెల్లింపులు చేశారు. ఈ పెరిగన పెన్షన్లకు జూలై 1 విడుదలకు దాదాపు నాలుగు వేల కోట్లు అవసరం ఉంటుందని, ఆగస్టు నెల నుంచి అయితే, నెలకు రూ. 2,800 కోట్లు అవసరం అవుతాయని అధికారుల లెక్క.

ఇక ప్రభుత్వం తలసేమియా, సీకేడీయూ డయాలసీస్‌, ప్రభుత్వ, ప్రైవేటు, సికిల్‌ సెల్‌ డిసీజ్‌, హిమోఫోలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు అందిస్తోంది. సైనిక్‌ వెల్ఫేర్‌ పెన్షన్‌, భూములు కోల్పోయిన అమరావతి పేదలకు రూ. 5 వేలతోపాటు రూ. 500 అభయహస్తంలో భాగంగా అందిస్తోంది. ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.