AP Politics: జనసేన – టీడీపీ మేనిఫెస్టో రెడీ.. ప్లాన్ ఇదే!

ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. నిధుల కొరత పెద్ద సవాల్ కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ భారీ హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక, వాటి అమలు చెయ్యడానికి మనీ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతోంది.
మాగ్జిమం ట్రై చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీ గొప్పగా ఏమీ లేదు కదా. అక్కడా నిధుల కొరత ఇప్పటికే ఉంది. ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీ+జనసేన కూటమి భారీ హామీలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందువల్ల ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా, ఖజనాలో నిధుల కొరత సమస్య బాగా ఉంటుంది. కొత్తగా ఆదాయం వచ్చే ప్రయత్నాలు చేస్తే తప్ప ప్రభుత్వం సాగని పరిస్థితి ఉంటుంది.


భోగి పండుగకు ముందురోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 3న్నర గంటలపాటూ భేటీ అయ్యి.. చాలా విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ప్రధానంగా టీడీపీ ఆల్రెడీ 6 గ్యారెంటీ హామీలు, జనసేన షణుఖ వ్యూహంలోని 6 అంశాలపై చర్చించారని తెలిసింది. ఇలా మొత్తం 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి ఈ మేనిఫెస్టోని ప్రకటించేసి, ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం జనవరి 18 లేదా 21న తిరుపతి లేదా ఇంకెక్కడైనా భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి, మేనిఫెస్టోని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడిగా ముందుకు:

ఇప్పటివరకూ జనసేన, టీడీపీ విడివిడిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. త్వరలో ఉమ్మడిగా ముందుకు సాగుతాయని తెలుస్తోంది. అలాగైతే, రెండు పార్టీల అభిమానులూ, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో వస్తారని అంచనాలున్నాయి. దీనిపై రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

అవతల వైసీపీ.. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంఛార్జులను నియమించేస్తోంది. తద్వారా ఎన్నికలకు రెడీ అవుతోంది. త్వరలోనే జగన్ రాష్ట్రవ్యాప్త టూర్ కూడా ఉంటుందని తెలిసింది. అందువల్ల టీడీపీ+జనసేన కూడా స్పీడ్ పెంచుతున్నాయి. ఓ అంచనా ప్రకారం.. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా జనసేన పోటీ చేస్తుందనీ, మిగతా జిల్లాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలుస్తోంది. కాపు వర్గం ఓట్లే టార్గెట్‌గా జనసేన ప్లాన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభంను జనసేన ఆహ్వానించినట్లు తెలుస్తోంది.మొత్తంగా రాజకీయాలు ఆసక్తిగానే ఉన్నాయి. ఈ మూడు నెలల్లో ఇంకా ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో చూస్తూ, చర్చించుకుందాం.