ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) ఇంటర్మీడియట్ కళాశాలలకు(Inter colleges) ప్రభుత్వం వేసవి సెలవులు(Summer holidays) ప్రకటించింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 1వ తేదీ నుంచి తిరిగి కళాశాలలు తెరచుకుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.
సెలవుల్లో కాలేజీలలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని, అలాగే షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం (AP Government) స్కూళ్లకు సైతం రెండు రోజుల క్రితమే వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 13 వరకూ అంటే 50 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. మార్చి 18 నుంచి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను ప్రకటించింది. అప్పటి నుంచి ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.