మంచు ఫ్యామిలీ వివాదం మలుపులు తిరుగుతూ వెళ్తోంది. ఆ వివాదంలో మోహన్ బాబు ఆవేశంతో టీవీ9 జర్నలిస్ట్‌పై దాడి చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ పూర్తిగా కోలుకోవడంకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మోహన్ బాబు దాడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు రోడ్డు ఎక్కారు. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.
జర్నలిస్ట్‌పై దాడి చేసిన వెంటనే అనారోగ్యంతో మోహన్ బాబు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. మోహన్ బాబు దాడిపై స్పందించారు. టీవీ9 మేనేజ్మెంట్కి, జర్నలిస్ట్‌లకు క్షమాపణలు తెలియజేశారు. ఆ క్షణంలో గేటు విరగొట్టి 30 మంది లోనికి ఉరుక్కుంటూ వస్తుంటే సంఘ వ్యతిరేక శక్తులు వస్తున్నారేమో అని నేను ఆందోళనతో ఆ పని చేశాను.
మీడియా మిత్రుడిపై అనుకోకుండా దాడి చేయడం జరిగింది. తన వల్ల జరిగిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నాను. టీవీ9 టీంకి, జర్నలిస్ట్ మిత్రుడు రంజిత్ కుటుంబానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. మీకు, మీ కుటుంబానికి కలిగిన మనోవేదనకు చింతిస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు.
మోహన్ బాబు దాడి నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. జర్నలిస్ట్‌లు రోడ్ల మీదకు వచ్చి మోహన్ బాబు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పడంతో గొడవ సర్దుమనిగినట్లు అయ్యింది. అయితే రంజిత్ ఆసుపత్రి ఖర్చుల విషయంలో మంచు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.