దీపావళి సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Apple MacBook Air M4 ల్యాప్‌టాప్ మోడల్‌కు ప్రత్యేక ఆఫర్ల తో అందుబాటులో ఉంచారు. 10-కోర్ CPU, 8-కోర్ GPU, 16GB యూనిఫైడ్ మెమరీ, 256GB SSD వంటి ఫీచర్లతో వచ్చిన పవర్ఫుల్ ల్యాప్‌టాప్. పాత ఇంటెల్ లేదా M1 MacBook వినియోగిస్తున్న వారికీ ల్యాప్‌టాప్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మంచి సమయం గా చెప్పుకోవచ్చు. అమెజాన్ పే ICICI కార్డ్ ద్వారా EMI, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్‌లో Apple MacBook Air M4 మోడల్ ల్యాప్‌టాప్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ అత్యాధునిక M4 చిప్‌తో వస్తోంది. ఇది పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ,ఎనర్జీ ఎఫిషియన్సీని అందిస్తుంది. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ యూజర్ల కోసం MacBook Air M4 ల్యాప్‌టాప్ బెస్ట్ గా నిలుస్తుంది. అమెజాన్ దీపావళి సేల్ లో MacBook Air M4 ధర ఎంత ఉంది.డిస్కౌంట్ తరువాత ఈ Apple MacBook Air M4 ధర,ఫీచర్స్,EMI వివరాలు చూద్దాం.
M4 చిప్‌తో కూడిన ఈ MacBook Air మోడల్ M1, M3 మోడల్స్ తో పోలిస్తే పవర్ఫుల్ ఎఫిషియన్సీని అందిస్తుంది. అమెజాన్ దీపావళి సేల్‌లో Apple MacBook Air M4 మోడల్ భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది.ఈ ధరకు అందుబాటులో ఉన్న మోడల్‌లో Apple యొక్క M4 చిప్ ఉంటుంది. ఇది10-కోర్ CPU , 8-కోర్ GPUతో వస్తుంది. ఇందులో 16GB మెమరీ+256GB SSD స్టోరేజ్ ఉంటుంది. Apple MacBook Air M4 మోడల్ లాంచ్ ధర 99,900 గా ఉంది.ఈ ల్యాప్‌టాప్ బ్యాంక్ ఆఫర్లు కలిపి 80,000 కన్నా తక్కువ ధరకు అమెజాన్ దీపావళి సేల్‌లో అందుబాటులో ఉంది.
13.6 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లే తో వస్తుంది.ఫోటోలు & వీడియోలు షార్ప్ డీటెయిల్స్ ,రిచ్ కాంట్రాస్ట్ తో వన్ బిలియన్ కలర్స్ కు సపోర్ట్ చేస్తుంది.12MP ఫ్రంట్ స్టేజి కెమెరా ,3 మైక్స్,ఫోర్ స్పీకర్లు కలిగి ఉంటుంది.దీనిలో ఉన్న M4 చిప్ మంచి స్పీడ్ వర్కింగ్ లైక్ ముల్టీపుల్ యాప్స్ ,వీడియో ఎడిటింగ్ ,గేమింగ్ లాంటి వాటికీ అందిస్తుంది.దీనిలో ఉన్న ఆపిల్ ఇంటెలిజెన్సు తో బ్యాటరీ 18 గంటలవరకు వర్క్ చేస్తుంది.ఇది రెండు వేరియంట్స్ 16GBRAM +256GB స్టోరేజ్ , 16GBRAM +512GB స్టోరేజ్ లలో వస్తుంది.ఇది మాక్ OS ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది.దీనిలో ఆపిల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయి.
మీరు పాత ఇంటెల్ తో పనిచేసే MacBookలు లేదా ఫస్ట్ జనరేషన్ M1 Air ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఈ కొత్త మోడల్‌లో ఉన్న పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, లాంగ్ టైం సాఫ్ట్‌వేర్ సపోర్ట్ , లేటెస్ట్ ఫీచర్లు బెస్ట్ అప్ గ్రేడ్ గా చెప్పుకోవచ్చు. M2 లేదా M3 Air ఉపయోగిస్తున్న వారికి ఈ అప్ గ్రేడ్ అంతగా అవసరం లేదు అనిపించవచ్చు.
అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 27,997 లెక్కన మూడు నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్ అందిస్తోంది.దీనితోపాటు అమెజాన్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై 3,000 వరకు స్పాట్ డిస్కౌంట్, Amazon Pay బ్యాలెన్స్ తో 4,199 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

































