Pmegp Scheme : PMEGP పథకం కోసం దరఖాస్తు చేసుకోండి. 10 లక్షలు లోన్ పొందండి.!

www.mannamweb.com


Pmegp Scheme : PMEGP పథకం కోసం దరఖాస్తు చేసుకోండి. 10 లక్షలు లోన్ పొందండి.!

Pmegp Scheme : భారత ప్రభుత్వం పౌరులకు ఎంతో ప్రయోజనం అందించటానికి ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొత్త PMEGP రుణ పథకం యువతి, యువకులు మరియు మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూర్చేందుకు అమలు చేయడం జరిగింది.

ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు రుజువు ద్వారా లోన్ కోసం అప్లై చెయ్యొచ్చు. అయితే లోన్ తో పాటుగా 35% సబ్సిడీ పథకం అందుబాటులో ఉన్నది. కావున ఈ ముఖ్యమైన పథకానికి ఎవరు అర్హులు మరియు అర్హత ప్రమణాలు ఏమిటి. లోన్ పొందే ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుందాం…

ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం : ఎన్నో సంవత్సరాలు గా విద్యను పూర్తి చేసి ఉద్యోగం రాని యువతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ముఖ్యమైన పథకాన్ని మొదలుపెట్టగా, సొంతంగా వ్యాపారం చేయాలి అనే అనుకునే యువతకు PMEGP ఈ పథకం కింద లోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే యువత ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మరియు లోన్ పొందడానికి మరియు ఉపాధిని మొదలు పెట్టడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్ కార్డు ను ఇవ్వడం ద్వారా లోన్ పొందవచ్చు. అలాగే లోనుకు సంబంధించిన అప్లికేషన్ ఆమోదం పొందిన తర్వాత వారు తక్కువ వడ్డీ రేటు తో తిరిగి కట్టాలి..

Pmegp Scheme PMEGP పథకానికి దరఖాస్తు చేసుకోండి మరియు పది లక్షల వరకు లోన్ పొందండి

ప్రస్తుతం యువతను ఉపాధితో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని మొదలు పెట్టింది. ఇది భారతదేశంలో యువతి,యువకుల అందరికీ కూడా తక్కువ వడ్డీ రేటుతో పది లక్షల వరకు లోన్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు. అయితే వారి సొంత వ్యాపారం, అంతేకాక గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి 35% మరియు నగరంలో ఉండే వారికి మాత్రమే 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లోన్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మనీ అందుబాటులో ఉండటంతో లోన్ తిరిగి కట్టడం ఎంతో సులభం అవుతుంది…

అర్హత : PMEGP లోన్ స్కీం కోసం మీరు అప్లై చేసుకునే వ్యక్తి ప్రాథమిక విద్యలో అనగా 10 లేక ఇంటర్ లో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
* వయో పరిమితి 18 ఏళ్లు పైన, 40 సంవత్సరాలు మధ్య వయసు ఉండాలి.
* వ్యాపారం చేయాలి అనుకునేవారు ఆ రంగంలో కొన్ని నిర్దిష్ట అర్హతలను కూడా కలిగి ఉండాలి.
* లోన్ పొందే వ్యక్తి భారతీయ పౌరుడు అని నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి.

మీరు ఈ పథకం కింద లోను పొందడానికి మరియు పనిని మొదలు పెట్టేందుకు పటిష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నట్లయితే, మీ లోన్ ఆమోద ప్రక్రియ అనేది తొందరగా పూర్తి అవుతుంది…

అవసరమైన పత్రాలు :
•ఆధార్ కార్డు.
•కుల ధ్రువీకరణ పత్రం.
•చిరునామా రుజువు.
* బ్యాంక్ పాస్ బుక్.
•10 లేక 12వ తరగతి మార్కులు.
•ఈమెయిల్ ఐడి.
•పాన్ కార్డు.

Pmegp Scheme : PMEGP పథకం కోసం దరఖాస్తు చేసుకోండి… 10 లక్షలు లోన్ పొందండి…!

Pmegp Scheme మీరు ఇంటి దగ్గర నుండే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి

PMEGP ఈ పథకం కోసం అప్లై ప్రక్రియ ఎంతో సులభం మరియు కేవలం. ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్లో సందర్శించాలి. అప్పుడు PMEGP రుణం ఎంపికపై క్లిక్ చేసి అభ్యర్థి ఇచ్చిన సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయండి. అలాగే ఫోటోపై కూడా క్లిక్ చేసి దానికి అవసరమైన పత్రాలను కూడా అప్ లోడ్ చేయాలి. ఈ మొత్తం సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది.అంతేకాక పత్రాలను అప్ లోడ్ చేసిన వెంటనే కింద ఇచ్చిన సబ్ మి ట్ బటన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత పత్రాలు ధ్రువీకరణ ప్రక్రియ,మీ రుణం అప్లికేషన్ ను ఆమోదిస్తారు. దీంతో మీ ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుంది…