రూ. 25 లక్షల కోసం ఇలా అప్లై చేసుకోండి…రూ. 9 లక్షల వరకూ సబ్సిడీ లభించే ఛాన్స్

PMEGP ప్రస్తుతం చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఒక వరంలా మారింది. ఈ స్కీం పూర్తి పేరు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్.


ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీం. ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను, నిరుద్యోగులను ప్రోత్సహించడానికి అనేక పథకాలపై సబ్సిడీ అందచేస్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి 35% వరకు సబ్సిడీ లభిస్తుంది. PMEGP స్కీమ్ సబ్సిడీ పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.

How to Get PMEGP Loan upto 25 Lakhs
>> PMEGP Loan కోసం మొదట బ్యాంకు నుంచి లోన్ అప్రూవ్ చేసుకోవాలి. ఇందు కోసం బ్యాంకులో లోన్ అప్లై చేసుకొని బ్యాంకు లోన్ అప్రూవ్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ తో PMEGP లాగిన్ పోర్టల్ లోకి వెళ్లాలి.

>> ఇఫ్పుడు పీఎంఈజీపీ పోర్టల్ లో కావాల్సిన వివరాలు నమోదు చేయాలి. ముఖ్యంగా ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ వంటి బేసిక్ డీటెయిల్స్ తెలియజేయాలి.

>> ఇప్పుడు ఒక ఏజెన్సీని ఎంపిక చేసుకోవాలి. మీరు ఏ ఏజెన్సీ ద్వారా సబ్సిడీ పొందాలనుకుంటున్నారో, అవి మొత్తం మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది ఖాదీ బోర్డు, రెండోది ఖాదీ కమిషన్, మూడోది డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి.

>> మీరు ఏ ఏజెన్సీ ద్వారా అయితే సబ్సిడీ కోసం అప్లై చేసుకున్నారో, ఆ ఏజెన్సీ వాళ్ళు వెరిఫై చేయడానికి వస్తారు, యూనిట్ నిజంగానే, ఏర్పాటు చేశారా, బిజినెస్ చేస్తున్నారా, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారా వంటి విషయాలు తెలుసుకుంటారు.

>> వెరిఫికేషన్ అనంతరం మనకు సబ్సిడీ రిలీజ్ చేస్తారు, ఈ సబ్సిడీ మీరు పొందాలి అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రమే పొందవచ్చు ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం సబ్సిడీ లభించదు.

>> ఉదాహరణకు ప్రభుత్వ బ్యాంకులో రూ. 25 లక్షల ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లయితే, అందులో మీకు రూ. 25 లక్షల లోన్ అప్రూవల్ అయినట్లయితే అందులో సబ్సిడీ రూ. 8,72,000 సబ్సిడీ లభించే అవకాశం ఉంది.

>> లోన్ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ప్రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో బిజినెస్ ఏంటి మన ఎక్స్పెండిచర్ ఏంటి, ప్రాఫిట్ ఎంత, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు వస్తుంది వంటి విషయాలను తెలియజేయాలి.

>> ప్రాజెక్ట్ రిపోర్ట్ ని బ్యాంకులో సబ్మిట్ చేసి ప్రాజెక్టుకు ఎంత లోన్ కావాలో తెలియజేసి, మీరు ఏ స్కీమ్ కింద వెళ్తున్నారో దాని ప్రకారం బ్యాంకు వారికి మన ప్రాజెక్ట్ నచ్చితే అంటే లోన్ శాంక్షన్ చేస్తారు.

>> లోన్ శాంక్షన్ అయిన తర్వాత లోన్ శాంక్షన్ లెటర్ ని PMEGP పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటది. అలాగే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఏజెన్సీ వారికి ఒక కాపీ సబ్మిట్ చేయాలి.

>> ఈ లోన్ శాంక్షన్ లెటర్ సబ్మిట్ చేసిన తర్వాత EDP ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఈడిపి ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే సబ్సిడీ లభిస్తుంది. ఈడిపి ట్రైనింగ్ అంటే అంత్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. ఇది పూర్తిగా ఆన్ లైన్ కోర్సు. ఇందులో 15 క్లాసులు ఉంటాయి. 15 ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయితేనే మనకు ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికెట్ వస్తుంది.

>> ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందిన అనంతరం మనకు సబ్సిడీ అనేది రిలీజ్ అవుతుంది. సబ్సిడీ రేటు విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు 25%, గ్రామీణ ప్రాంతాలకు 35%

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.