కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే

www.mannamweb.com


ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్‌ పోస్టులకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుంది. చదువు పూర్తికాగానే వర్క్‌ ఎక్స్‌పోజర్‌ కోసం చాలా మంది విద్యార్థులు అప్రెంటిస్‌ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రక్షణ రంగ సంస్థ డీర్‌డీఓ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐటీఐ అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీఓ తమ సంస్థలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 40, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు 40, ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ పాస్) 120 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబ్‌ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డీర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

ఇక అర్హత విషయానికొస్తే.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీటెక్ (ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్) పూర్తి చేసి ఉండాలని అధికారులు తెలిపారు. టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా) పోస్టులకు అప్లై చేసేవారు డిప్లొమా ఇన్ (ఈసీఈ, ఈఈఈ, సీఎస్ ఈ, మెకానికల్, కెమికల్) పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు గాను సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్థుల వయసు విషయానికొస్తే ఆగస్టు 1, 2024 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్) పూర్తి చేసిన రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకడమిక్ మెరిట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.