హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈసీఐఎల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 437 ట్రేడ్ అప్రెంటిస్ షిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.? అర్హులు ఎవరు.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 437 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో యూఆర్-175, ఈడబ్ల్యూఎస్-44, ఓబీసీ-120, ఎస్‌సీ-65, ఎస్టీ 33 ఉన్నాయి. ఇక పోస్టుల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 162, ఎలక్ట్రీషియన్- 70, ఫిట్టర్- 70, మెకానిక్ (ఆర్ అండ్ ఏసీ)- 17, టర్నర్- 17, మెషినిస్ట్- 17, మెషినిస్ట్(గ్రైండర్)- 13,
సీఓపీఏ- 45, వెల్డర్- 22, పెయింటర్- 4 ఉన్నాయి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల29లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ముందుగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ లో అప్రెంటిస్ గా నమోదు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు 29వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31.10.2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 30 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదనంగా 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.
అభ్యర్థులను ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ విద్యార్థులకు కేటాయిస్తారు. ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ శిక్షణ ఉంటుంది. 01 నవంబర్, 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అంటే NCVT సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.