ఈ సారి కటాఫ్ మార్కులు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు విశ్లేషణ ప్రకారం 40-45 మార్కుల మధ్యలో Cut Off ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68-70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం. గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ లేదా జూలైలో గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.