తెలుపు రంగు కారు కొంటే ఇన్ని లాభాలుంటాయా

మనం రోడ్డుపై వెళుతున్నపుడు తెలుపురంగు కార్లే ఎక్కువగా కనిపిస్తాయి… ఇలా ఎక్కువమంది తెల్లకార్లు వాడటంవెనకున్న రీజన్స్ ఏమిటో తెలుసా?

వైట్ కారుతో ఎన్ని లాభాలో తెలుసా?

మీరు ఏదైనా కొత్తవాహనం కొనేటప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది… అది వెహికిల్ మైలేజ్, ఫీచర్లు, ధర వంటివి. ఇక కారు కొంటుంటే వీటితో పాటు రంగు కూడా కీలకం అవుతుంది… అందుకే కుటుంబసభ్యులు, స్నేహితులతో చర్చించి ఏ రంగు కారు కొనాలో నిర్ణయిస్తారు. మనం ఏ కంపెనీ, ఏ మోడల్ కారు కొనాలో నిర్ణయం తీసుకున్నాక కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతుంది.. ఏ రంగుది తీసుకోవాలని. ఎందుకంటే రంగుల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి… అందుకే సరైన రంగు ఎంచుకోవడం కష్టంగా ఉంటుంది.


అయితే చాలామంది తెలుపురంగు కార్లను తీసుకునేందుకే ఇష్టపడతారు… కంపెనీలు కూడా ఇతర కలర్స్ తో పోలిస్తే తెలుపు కార్లనే ఎక్కువగా ఉత్పత్తిచేస్తాయి. మనం రోడ్డుపై వెళుతున్నపుడు కూడా తెలుపు రంగు కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఆటోమొబైల్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం కూడా పలు విషయాల్లో ఇతర రంగుల కంటే తెలుపు రంగు కార్లే బెస్ట్ అట. ఇలా తెల్లని కార్ల వెనకున్న సీక్రెట్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

వైట్ కలర్ కార్ల వల్ల లాభాలు

1. కారు చల్లగా ఉంటుంది

మనకు ఎండాకాలంలో ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది… నల్ల రంగు దుస్తులు వేసుకుంటే మరింత వేడిగాను… తెల్లని దుస్తులు ధరిస్తే కాస్త చల్లగాను ఉంటుంది. సేమ్ ఇలాగే తెల్ల కార్లు ఎక్కువ వేడిని, ఎండను ధరిచేరనివ్వవు… అందుకే ఇతర రంగు కార్లతో పోలిస్తే వీటిలో వేడి సమయాల్లోనూ కాస్త చల్లగా ఉంటుంది.

సాధారణంగా ఒక గంట ఎండలో ఉంటే నల్ల కారు 70 డిగ్రీల సెల్సియస్, వెండిరంగు కారు 63 డిగ్రీల సెల్సియస్ వేడెక్కుతాయి.. కానీ తెల్ల కారు 44 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే వేడెక్కుతాయట. కాబట్టి ఇండియా వంటి దేశాల్లో వేడి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తెల్ల కార్లు చాలా ముఖ్యం. కారు చల్లగా ఉంటే AC తక్కువ వాడొచ్చు… తద్వారా ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఇలా తెల్లకార్ల వాడకంవల్ల వేడినుండి ఉపశమనం పొందడమే కాదు డబ్బులు కూడా ఆదా అవుతాయి.

2. తెల్ల కారు రంగు వెలిసిపోదు

సాధారణంగా ఇండియా వంటి దేశాల్లో తరచూ వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి… దీనివల్ల కార్ల రంగు దెబ్బతింటుంది. ఎక్కువగా ఎండలో లేదంటే ఎక్కువగా వానలో ఉంటే ఎరుపు, నలుపు కార్ల రంగు వెలిసిపోతుంది… కానీ తెల్ల కార్లకు ఈ సమస్య ఉండదు. తెల్ల రంగు వెలిసిపోయినా కూడా పెద్దగా తెలియదు. ఈ తెల్లరంగు కార్లతో మరో అడ్వాంటేజ్ ఏంటంటే స్క్రాచెస్ పడినా పెద్దగా కనిపించవు కాబట్టి పెయింటింగ్ చేయించాల్సిన అవసరం ఉండదు… ఇలా తెల్లరంగువల్ల కార్లు అందంగా కనిపించడమే కాదు డబ్బుల ఖర్చు తగ్గుతుంది.

3. తెలుపు రంగు కార్ల ఖర్చు తక్కువ

ఏ కంపనీ, ఏ మోడల్ కారయినా తెలుపు రంగులో పక్కా ఉంటుంది… ఇతర రంగుల్లో లభించకపోయిన తెలుపులో పక్కా అందుబాటులో ఉంటుంది. ఇలా తెలుపు రంగు కార్లు సులభంగా దొరకడమే కాదు రిపేర్ సమయంలో పార్ట్స్ కూడా ఈజీగా లభిస్తాయి… అందుకే రిపేర్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఇతర రంగుల కార్లుగానీ, వాటి పార్ట్స గానీ అంత ఈజీగా దొరకవు… కొన్ని కంపెనీ నుండి ఆర్డర్ ద్వారా తెప్పించాల్సి ఉంటుంది… కాబట్టి ఖరీదు ఎక్కువ. మ్యాట్ ఫినిష్ ఖరీదైనప్పటికీ సాధారణ తెలుపు రంగు రిపేర్ చేయడం చాలా తేలిక.

4. తెలుసు కార్లకు మచి రీసేల్ ధర…

తెల్ల కార్లు కొనేటప్పుడు తక్కువ ధరకు లభించడమే కాదు తిరిగి అమ్మేటపుడు మంచి ధర వస్తుంది.. ఎందుకంటే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కార్లలో 18% నలుపు రంగువి కాగా, 49% తెలుపు రంగువి. ఇండియాలో 10 కార్లలో 7 తెల్లవే. అందుకే త్వరగా రీసేల్ ఉంటుంది… మంచి ధర కూడా వస్తుంది.

5. తెల్ల కార్లతో భద్రత

తెలుపు రంగు కారు రాత్రి సమయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది… దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా రోడ్డు భద్రత కోసం కూడా తెలుపు రంగును ఎంచుకోవడం మంచిదే.

మీ కారు రంగు మీ ఇష్టం… ఇలాగైతే మాత్రం తెల్లకారే బెస్ట్

తెల్ల కార్లు కంఫర్టబుల్, మన్నికైనవి, ఖర్చు తక్కువ. అయితే కొత్త రంగులు ఇష్టపడేవారు వాటినే ఎంచుకోవచ్చు. చల్లని ప్రదేశాల్లో ఉండేవారు, కారు పార్కింగ్ కి షెడ్ ఉన్నవారు కూడా వేరే రంగులు ఎంచుకోవచ్చు. మీ ఇష్టం, ప్రాక్టికాలిటీ రెండూ చూసుకోవాలి. ఇండియా వంటి వేడి ప్రదేశంలో, మళ్ళీ అమ్మాలనుకున్నప్పుడు మంచి ధర రావాలంటే మాత్రం తెల్ల కారు ఎంచుకోవడం బెస్ట్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.