మీరు సిమ్‌కార్డు యాక్టివేట్ చేసుకుంటున్నారా.? అయితే అడ్డంగా బుక్కయినట్టే.

సాధారణంగా మీ దగ్గర ఉన్న సిమ్ కార్డు డి యాక్టివేట్ అయినప్పుడు.. అదే నెంబర్ పై మళ్లీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త సిమ్ కార్డు కావాలన్నా.. అందుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీ ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ తో పాటు బయోమెట్రిక్ లేకుంటే మీరు సిమ్ కార్డు పొందలేరు కదా.

కస్టమర్ల ఐడీలతో కస్టమర్లకి తెలియకుండా నకిలీ సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి.. ఒక సిమ్ కార్డ్ తో  సుమారు 5 నుంచి 6 జీ మెయిల్ అక్కౌంట్స్,  సుమారు 20 వరకు సోషల్ మీడియా అక్కౌంట్స్ ఓపెన్ చేసి వాటి తో ఇల్లీగల్ బెట్టింగ్, బ్రాండ్స్ ప్రొమోషన్స్, యూట్యూబ్ వ్యూస్ పెంచటం, కంబోడియా, థాయిలాండ్ దేశాలలో ఉన్న సైబర్ క్రైమ్ ముఠా ల కి సోషల్ మీడియా అక్కౌంట్స్ అందిస్తున్న వొడాఫోన్ సిమ్ డిస్ట్రిబ్యూటర్‌, సహాయకుడు ని అరెస్ట్ చేసారు విశాఖ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. విశాఖలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు పెరుగుతుండడంతో.. వాటి మూలాలపై దృష్టిసారించారు పోలీసులు. నేరాలు జరుగుతున్న తీరు, నేరాల కోసం నేరగాళ్లు వినియోగిస్తున్న నెట్వర్క్ సోషల్ మీడియా ఎకౌంట్స్ పై దృష్టి సారించారు. కూపి లాగితే.. కొన్ని వివరాలు చిక్కినా.. ఆ వివరాలు తో సంబంధిత వ్యక్తుల దగ్గరికి వెళ్లేసరికి పోలీసులకు షాక్. ఎందుకంటే ఆ నెరాలకు వారికి సంబంధం ఉండదు. కానీ వాళ్ల పేరు మీద యాక్టివేట్ అయిన సిమ్ కార్డుతో నేరాలు జరిగిపోతున్నాయి. దీంతో ఇక మూలలపై వర్కౌట్ చేశారు పోలీసులు. విశాఖలో ఊపి లాగితే లింకు నిడదవోలు,  తాడేపల్లిగూడెంలో తగిలింది.


అలా బయటపడింది..

సీపీ.. శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ నియంత్రణ చర్యలో భాగంగా.. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం పేరుతో కస్టమర్ల ఐడీలను.. కస్టమర్ లకి తెలియకుండా  వందలాది నకిలీ సిమ్ కార్డులను అక్రమంగా యాక్టివేట్ చేస్తునారనే పక్కా సమాచారం తో నిడదవోలు, తాడేపల్లిగూడెం కి చెందిన ఇద్దరు వ్యక్తుల కదలికలపై పత్యేకమైన నిఘా పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో అదుపులోకి తీసుకొని  విచారించారు. దింతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

వీళ్ళు చేస్తున్నది ఇదే..

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కి చెందిన గంట రామకృష్ణ నిడదవోలులో వోడాఫోన్ డిస్ట్రిబ్యూటర్. సిమ్లను యాక్టివేట్ చేసేవాడు. ఈ క్రమంలో గంట రామకృష్ణ, అతని సహాయకుడు వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కి చెందిన అడపా కొండబాబు తో కలిసి అధిక సంపాదన పై దురుద్దేశం కలిగింది. దింతో పాయింట్ ఆఫ్ సేల్ – POS వద్ద కి వచ్చిన కస్టమర్లు దగ్గర ఐరిస్, థంబ్ (వేలిముద్ర) సరిగా పడలేదని  చెబుతారు.  రెండోసారి కస్టమర్ల  నుంచి ఐరిస్, వేలిముద్రలు తీసుకొని కస్టమర్ పేరు మీద  ఇంకో  నెంబర్ ని యాక్టివేట్ చేసేవాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు  సుమారుగా 500 నుండి 600 సిమ్ లు   వరకు యాక్టివేట్ చేసి ఈ సిమ్ లను సైబర్ నేరాలకి పాల్పడే వారికి అందించే వారు. అందులో మరికొన్ని  కొండబాబు, శరత్, వెంకటేశ్ అనే వ్యక్తిలకి అందించేవాడు.  కొండబాబు, శరత్ ,  వెంకటేశ్ ఆ సిమ్ ల ద్వారా యూట్యూబ్, జిమెయిల్, ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్, ఆర్కుట్ కి యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయటం , యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ కి పెయిడ్ బేస్డ్ వ్యూ స్ పెంచటం, నకిలీ సోషల్ మీడియా అక్కౌంట్స్ ఓపెన్ చేయటం వంటి అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు. ఈ విధంగా క్రియేట్ చేసిన నకిలీ సోషల్ మీడియా  అకౌంట్ వెరిఫికేషన్ కి OTP సదరు జిమెయిల్ కి రావడం జరిగేది. అందుకుగాను అధిక సంఖ్యలో జి మెయిల్ అకౌంట్ అవసరం ఉన్నందున నకిలీ ద్వారా ఇలా వేల సంఖ్యలో ఫేక్ జీ మెయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసి తద్వారా వేల సంఖ్యలో నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసేవారు.

వారి ప్లాన్ మాములుగా లేదు.. సైబర్ నెరగాళ్ల చేతుల్లోకి..

ఇలా ఓపెన్ చేసిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లో థాయిలాండ్, కాంబోడియన్ దేశాల్లో ఉన్న సైబర్ నేరస్థులకు అందజేసే వారికి సాయం చేసేవారు.  అందులో కొన్ని రోజులు తర్వాత ఫేక్ యాక్టీవేటెడ్ సిమ్ లు  తిరిగి ఇచ్చేసేవారు. ఆ సిమ్ లను  యాక్టివ్  గా ఉంటే UPC పెట్టి మరో నెట్వర్క్  ఏజెంట్లుకి ఎక్స్ఛేంజి, అమౌంట్ ఇచ్చి అదిక మొత్తంలో  సంపాదించేవారు. ఈ విధంగా కస్టమర్ తెలియకుండా వేరొక సిమ్ ను యాక్టివేట్ చేసి దానిని సబ్ ఏజెంట్ అయిన వెంకటేష్ ద్వారా యాక్టివేట్ అయిన సిమ్ లును కొండబాబు , శరత్ లు తీసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అంతర్జాతీయ సైబర్ నేరస్థులు తో సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దింతో గంటా రామకృష్ణ, అడపా కొండబాబులను ప్రత్యేక బ్రందాలతో నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఎవరయినా సైబర్ నేరాలు చేసినా,  వారికి సహకరించినా, ఎటువంటి అసాంఘిక కార్యకలపాల్లో  పల్గోన్నా చట్ట ప్రకారం తగు చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in,  టోల్ ఫ్రీ నెంబర్: 1930, సీపీ : 7995095799,  కాల్ చేసి ఫిర్యాదు చేయగలరని ప్రకటించారు పోలీసులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.