అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా? బిల్డర్ తో దీని గురించి గొడవ పడొద్దు..

 ప్రతి ఒక్కరూ సొంత ఇంట్లో ఉండాలని కలల కంటూ ఉంటారు. ఒకప్పుడు స్థలం కొనుగోలు చేసి ఆ తరువాత అందులో సొంత ఇల్ల కట్టుకునేవారు.


కానీ ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో సరైన స్థలాలు అందుబాటులో లేవు. అంతేకాకండా ఒక స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటే చాలా సమయం పడుతుంది. దీంతో సొంత ఇల్లు ఉండాలని కావాలని అనుకునేవారు రెడీమేడ్ హౌస్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వారి కోసం అపార్టు మెంట్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే అపార్ట్ మెంట్ లో ప్లాట్ కొనేవారు చాలా విషయాలు తెలిసి ఉండాలి. దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే అపార్ట్ మెంట్ లో ప్లాట్ కొనుగోలు చేయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతున్నారు. అపార్ట్ మెంట్ లో స్థలం కొనుగోలు చేసేవారికి బిల్డర్ కొన్ని విషయాలను ముందుగా చెబుతారు. వీటిలో ప్లాట్ 1500 స్వేర్ ఫీట్ అని చెబుతారు. కానీ ప్లాట్ లోకి వెళ్లి చూస్తే మాత్రం 1000 స్వేర్ ఫీట్ మాత్రమే కనిపిస్తుంది. మరి ఇందులో తేడా ఎందుకు ఉంది? అని చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. కానీ ఎవరూ పట్టించుకోరు. అయితే అసలు విషయం ఇది అన్నమాట..

కొందరు బిల్డర్స్ అపార్ట్ మెంట్ లో ప్లాట్ సేల్ ఉంది అనగానే.. కొనుగోలు చేయడానికి వెళ్తారు. అయితే ముందుగా ఫ్లాట్ ఎంత విస్తీర్ణంలో ఉంది అని తెలుసుకుంటాం. దీంతో బిల్డర్ 15 స్క్వేర్ ఫీట్ అని చెబుతాడు. కానీ లోపలికి వెళ్లేసరికి 1000 స్క్వేర్ ఫీట్ మాత్రమే కనిపిస్తుంది. మిగతా ప్లేస్ అంతా ఏమైంది? అన్న సందేహం కలుగుతుంది. ఇక్కడ బిల్డర్ ది ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే అన్ని కలిపి ఫ్లాట్ గురించి చెప్తాడు. వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే?

కార్పెట్ ఏరియా.. ఇది ప్లాట్ లో నడవడానికి సౌకర్యంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒక కార్పెట్ నేలపై పరిస్తే ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుందో దానిని కార్పెట్ ఏరియా అంటారు. ఇది కచ్చితంగా బిల్డర్ చెప్పిన దాంట్లో 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఈ కార్పెట్ ఏరియాతోపాటు ఇంటర్నల్ వాల్స్ అంటే ఇంటి లోపల ఉండే గోడల కింద స్థలం కలిపి కార్బెట్ ఏరియా అంటారు.

అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉండే రెండోది.. బిల్డ్ అప్ ఏరియా.. ఫ్లాట్ కు బాల్కనీ, యుటిలిటీ ఏరియా, ఎక్స్టర్నల్ వాల్స్ ను కలిపి బిల్డప్ ఏరియా అంటారు. ఇది ఫ్లాట్ కు ఎటువైపు అయినా ఉండొచ్చు. ఈ స్థలం అంతా కలిపి 200 స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు.

అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేవారు మరో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే.. మీరు సూపర్ బిల్డప్ ఏరియాకు కూడా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఒక అపార్ట్మెంట్లో ఆటస్థలం.. మెట్లు.. లిఫ్టు.. అపార్ట్మెంట్ పార్కింగ్.. వంటి స్థలాలకు కూడా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి మొత్తం కలిపి 300 స్క్వేర్ ఫీట్ గా పరిగణిస్తారు.

ఇలా మనకు ఉపయోగపడేది 1200 స్క్వేర్ ఫీట్ కావచ్చు.. కానీ అపార్ట్మెంట్లోని సూపర్ బిల్డప్ ఏరియాకు కూడా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే అంతా కలిపి 1500 స్క్వేర్ ఫీట్ గా పరిగణించి ప్లాట్లు సేల్ చేస్తారు. అందువల్ల అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేవారు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.