Buying New Fridge Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇంకా కొంతమంది ప్రతి రెండు మూడేళ్లకు ఒకసారి ఫ్రిడ్జ్‌ని మారుస్తూ ఉంటారు.
ఎండాకాలమైతే ఫ్రిజ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది కొనడానికి ట్రై చేస్తారు. గతంలో కంటే ఫ్రిడ్జి రేట్లు కూడా తగ్గిపోయాయి. సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఫ్రిడ్జ్ కొనేముందు కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
ఫ్రిజ్ కొనుగోలు చేసే ముందు వాటి రేటింగ్స్, ఫీచర్స్ గురించి అవగాహన ఉండాలి. కాలంతో పాటు రిఫ్రిజిరేటర్లలో చాలా మార్పులు వచ్చాయి. మార్కెట్‌లో ఇప్పటి వరకు సాధారణ రిఫ్రిజి రేటర్లు ఎక్కువగా కరెంటు వినియోగించేవి ఉన్నాయి. అయితే టెక్నాలజీ మారడంతో విద్యుత్ పొదపు చేసే ఫ్రిడ్జ్ రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఫ్రిడ్జ్‌లో విద్యుత్ ఆదా కోసం 3, 4,5 స్టార్ రేటింగ్‌లు ఇస్తున్నారు. అంతేకాకుండా ఇన్వర్టర్ ఫ్రిజ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి చాలా విద్యుత్ ఆదా చేస్తాయి. 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్‌ల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది.
5 స్టార్ ఫ్రిడ్జిలు 4 స్టార్ కంటే చాలా ఖరీదైనవి. అలాగే వాటి ఫీచర్స్ కూడా బలంగా ఉంటాయి. 5 స్టార్ ఫ్రిడ్జిలో లేటెస్ట్ టెక్నాలజీ అమరుస్తారు. దీని కారణంగా 4 స్టార్ ఫ్రిడ్జిలతో పోలిస్తే 5 స్టార్ ఫ్రిడ్జిలు ఏడాదికి 100 నుంచి 150 యూనిట్ల తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఈ కారణంగా మార్కెట్లో 4 స్టార్ ఫ్రిడ్జి కంటే 5 స్టార్ ఫ్రిడ్జికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్లు ఖరీదైనవి. ఇవి పర్యావరణానికి ఎక్కవుగా హాని చేయవు. తక్కువ పొల్యూషన్ వాయువులను విడుదల చేస్తాయి. కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. కొంచెం రేటు ఎక్కువైనా పర్వాలేదు కానీ 5 స్టార్ ఫ్రిడ్జి కొనడమే ఉత్తమం.