టీలో యాలకులు వేసి తయారు చేయటం వల్ల టీ రుచి పెరుగుతుంది. ఘాటును కూడా కలిగిస్తాయి. ఛాయ్ నుంచి వచ్చే వాసన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. యాలకులు టీలో వేయడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
అలాగే యాలకుల టీ వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిపోతాయి. టీలో యాలకులు వేయడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఫలితంగా కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుంది.
యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాలు పనితీరుకు సహకరిస్తుంది. అంతేకాకుండా యాలకులతో కలిపిన టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు తొలగిపోతాయి. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
యాలకులు వేసిన టీ తాగటం ల్ల శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. టీలో యాలకులు వేయటం వల్ల సెరోటోనిన్, ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. యాలకుల టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది. దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు నివారించవచ్చు. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
యాలకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. శ్వాసను తాజాగా ఉంచడానికి, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడానికి సహాయపడుతుంది. టీలో యాలకులు వేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. అంతేకాదు యాలకులు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా యాలకులు టీ తాగడం మంచిది.
































