పోషకాలు సమృద్ధిగా ఉన్న పండ్లలో ఖర్జూరం పండు కూడా ఒకటి. ఖర్జూర పండు dates fruit benefits రుచి లోనూ శరీర ఆరోగ్యానికి మేలు చేయడం లోను ముందుంటుంది.
అయితే ఈ ఖర్జూర పండు తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా లభించడంతో పాటు ఫైబర్, క్యాలరీలు ,ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి 6, పొటాషియం వంటి మరెన్నో పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇకపోతే ఖర్జూర పండులో అనేక ప్రయోజనాలు ఉన్నాగాని ఈ పండును ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. దీనివలన అందరూ ఈ పండుని తినలేరు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఖర్జూరాలను ఎక్కువగా తీసుకున్నట్లయితే అది శరీరం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వలన కొందరికి సల్ఫైడ్‌లను కూడా కలిగిస్తుంది. ఇక మరికొందరికి అయితే చర్మం, కళ్ళపై దురద వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా టైప్-2 మధుమేహ రోగులకు ఈ ఖర్జూరాలు డేంజర్ అని చెప్పవచ్చు.
ఒకవేళ ఖర్జూరాలను ఎక్కువగా తీసుకున్నట్లయితే హైపోగ్లైసీమియా వంటి సమస్యల బారిన పడవచ్చు. కాబట్టి వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి.ఖర్జూరంలో అధికంగా క్యాలరీలు ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గడానికి ఎక్కువ ప్రభావితంగా ఉండకపోవచ్చు. కనుక ఈ ఖర్జూర పండ్లకు బదులుగా మరేదైనా ఇతర పండ్లను తినడం మంచిది.పరిమితికి మించి ఖర్జూర పండ్లను తిన్నట్లయితే అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువ ఖర్జూరాలను తినడం వలన కళ్ళు దురద ఎర్రటి కళ్ళు వంటి సమస్యలు తలెత్తుతాయి