బాదంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అందుకే బాదం పప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజ నకరంగా భావిస్తారు.
ముఖ్యంగా శీతాకాలం లో బాదం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. బాదం లో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-E వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యానికి, ఎముకలకు, జుట్టుకు ఉపయోగపడతాయని చెబుతారు. కానీ, బాదం అందరికీ సరిపోదు. ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరు బాదం తినకూడదో స్పష్టత ఇస్తున్నారు.
బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను నిర్వహించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. పేగులను శుభ్రంగా ఉంచుతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 5 నుండి 7 బాదంపప్పులను శుభ్రమైన నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో బాదం పప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి. కానీ వాటిని త్వరగా మింగేయకుండా బాగా నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ బాదం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదంలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్.. శరీరానికి అవసరమైన శక్తిని విడుదల చేయడంలో సహాయపడతాయి.
బాదంలో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటైన్ అనే పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడు నిత్యం చురుగ్గా ఉండేలా సాయం చేస్తాయి. అయితే.. నిపుణుల ప్రకారం, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, అధిక రక్తపోటుకు మందులు వాడుతున్నవారు బాదం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చు. చాలామందికి బాదం శరీరానికి వేడి ఇవ్వడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగ పడు తుంది. కానీ, బాదం తిన్న తర్వాత కడుపు నొప్పి, గ్యాస్ లేదా మొటిమలు వస్తే వెంటనే జాగ్రత్త పడాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాదం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బాదంలో ఫాస్ఫరస్, ఆక్సలేట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని యాంటీబయాటిక్ మందులు వాడుతున్నవారు కూడా బాదం తినకపోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా బాదాన్ని మితంగా మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
































