పల్లీలు తింటున్నారా? అయితే క్యాన్సర్ పక్కా

సాయంత్రం పూటనో, లేదా వర్షం పడుతున్నపుడో స్నాక్స్ లాగ ఉడకబెట్టిన, వేయించిన పల్లీలు తింటూ ఉంటాం. అలాగే వంటల్లో కూడా పల్లీలు వాడుతూ ఉంటాం.


మీరు గనుక రెగ్యులర్ గా పల్లీలు తింటూ ఉన్నట్టయితే మీకు క్యాన్సర్ రావడం పక్కా అన్నమాట. అదేంటీ పల్లీలకు క్యాన్సర్ కు సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఉంది. పల్లీలు లేదా వేరుశెనగ కాయల్లో క్యాన్సర్ కలిగించే ఓ భయంకర విషపదార్థం ఉంటుంది. అదే అప్లోటాక్సిన్. ఇది అత్యంత విషపూరిత పదార్థం. ఇది మీ శరీరంలోకి వెళితే ఇక మీ ఒంట్లోకి కాలేయ క్యాన్సర్ వచ్చి కూర్చున్నట్టే.

రోజూ తినే ఆహారపదార్థాల్లో ఇన్నిరోజులు ఇంతమంది వాడుతున్నారు కదా, వారి సంగతి ఏంటీ అనే అనుమానం మీకు రావొచ్చు. అయితే పల్లీలు అంటే అన్నీ కాదు. చేదుగా ఉండే పల్లీలు. బూజు పట్టిన, నల్లగా గాని, ఆకుపచ్చ రంగులోకి మారిన పల్లీల్లో ఈ అప్లోటాక్సిన్ ఉంటుంది. నిజానికి అప్లోటాక్సిన్ అనేది ఆస్పెర్‌గిల్లస్ ఫ్లావస్, ఆస్పెర్‌గిల్లస్ పారాసిటికస్ అనే శిలీంద్రాల (ఫంగస్) చే ఉత్పత్తి చేయబడే ఒక రకమైన విషపూరిత మిశ్రమం అని చెప్పవచ్చు. వేరుశెనగ పంటలు అధిక తేమ, శిలీంద్ర సంక్రమణకు గురైనప్పుడు అప్లోటాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే వేరుశెనగ కాయలను తేమతో కూడిన వాతావరణంలో లేదా సరైన వెంటిలేషన్ లేని పరిస్థితుల్లో నిల్వ చేసినప్పుడు శిలీంద్రాలు వృద్ధి చెంది అప్లోటాక్సిన్ ను ఉత్పత్తి చేస్తాయి. కాయలపై పురుగులు దాడి వల్ల కాయలు దెబ్బతిన్నప్పుడు కూడా శిలీంద్రాలు సులభంగా వెళ్లి విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలాగే పల్లీలను ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల శిలీంద్రాలు(బూజు) సులభంగా ఏర్పడి, అప్లోటాక్సిన్ ను ఉత్పత్తి చేస్తాయి.

అప్లోటాక్సిన్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. B1, B2, G1, G2. వీటిలో అప్లోటాక్సిన్ B1 అత్యంత విషపూరితం అలాగే అత్యంత సాధారణమైనది కూడా. అంటే మనకు పండ్లు, గింజలు, ధాన్యాల మీద కనిపిస్తూ ఉండేది. ఇది కాలేయ క్యాన్సర్ (హెపాటోసెల్యులార్ కార్సినోమా)తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించి మరణానికి దారి తీస్తుంది. ఇది కొద్దిమొత్తంలో దేహంలో చేరితే వికారం, వాంతులు, కడుపు నొప్పి, కామెర్లు (జాండిస్) వస్తాయి. నిర్లక్ష్యం చేస్తే వీటి వల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. అదే ఈ విషపదార్థం ఒకేసారి ఎక్కువ మొత్తంలో దేహంలో చేరితే కాలేయ క్యాన్సర్ కు దారి తీస్తుంది. అయితే అది సాధారణ క్యాన్సర్ కాకుండా తీవ్రమైన క్యాన్సర్ ను కలగజేస్తుంది, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే చావు నోట్లో తలపెట్టడమే.

మరి మన ఒంట్లోకి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే.. బూజుపట్టిన వాటిని తినకుండా ముందుగానే పడవేయాలి. పల్లీలు తింటున్నప్పుడు ఒకవేళ నోరు చేదుగా అనిపిస్తే.. మొత్తం బయటకు ఉమ్మేసి, నీటితో నోరును బాగా పుక్కిలించాలి. పల్లీలను బాగా ఉడకబెట్టడం, వేయించడం ద్వారా కొంత విష ప్రభావం తగ్గుతుంది గాని, పూర్తిగా తగ్గదు. కాబట్టి ఏకాస్త పాడయ్యాయి అనే అనుమానం వచ్చినా బయట పారేయడమే ఉత్తమం. వేరుశెనగకాయలను బాగా గాలి తగిలే ప్రదేశాల్లో నిల్వ ఉంచడం, పల్లీలను ఎండలో బాగా ఆరబెట్టడం వల్ల తేమ శాతం తగ్గి బూజు పట్టకుండా ఉంటాయి. సో.. ఇకపై పల్లీలు గాని, వేరుశెనగకాయలు గాని తింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.