తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక తండ్రి తన పిల్లలు తింటున్న బార్‌బన్ బిస్కెట్లలో ఒకదానిలో సన్నని ఇనుప తీగ వచ్చింది. అప్రమత్తమైన ఆ వ్యక్తి త్వరగా దాన్ని రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో కలుషితమైన బిస్కెట్ వీడియోను షేర్ చేశాడు.
ఇలాంటి బిస్కెట్ల తినేటప్పుడు జాగ్రత్త వహించాలని హెచ్చరించాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
దేవునిపల్లికి చెందిన హనుమంతరెడ్డి తన పిల్లలకు స్థానిక దుకాణంలో బిస్కెట్లు కొనుగోలు చేశాడు. అతని పిల్లలు బిస్కెట్లు తింటుడగా సన్నని ఇనుప తీగ వచ్చింది. దాన్ని వారి తండ్రికి పిల్లలు చూపెట్టారు. దీంతో అతను ఫోన్ తీసుకొని రికార్డు చేశాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిరుతిళ్లు తినిపించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే వారి ప్రాణానికే ప్రమాదరకరమని అతను హెచ్చరించాడు. “ఇది చాలా ఘోరంగా ఉంది అని.. తల్లిదండ్రులందరినీ అప్రమత్తం చేయడానికి నేను ఈ వీడియోను చేస్తున్నాను..దయచేసి, మీ పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లోపల ఏమి ఉందో మీకు ఎప్పటికీ తెలియదు,” అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే ఒక్కొసారి భయం వేస్తుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆహార భద్రత లేకుండా మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి ప్రమాదకరమైన వస్తువు ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్‌లోకి ఎలా ప్రవేశించిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి బాధ్యులైన కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.