Fruits: పండ్లు తింటున్నారా?.. ఒక్క క్షణం

మీరు పండ్లు తింటున్నారా? కాస్త ఆగండి.. తినే ముందు వాటిని జాగ్రత్తగా పరిశీలించండి.. ఎందుకంటే ‘ఫ్రూట్‌ ఫ్లై’ అనే సూక్ష్మకీటకాలు వాలి పండ్లను తినేస్తాయి. ఆ తర్వాత మనం తింటే అనారోగ్యం బారిన పడతామని ఓయూ జంతు శాస్త్ర విభాగం ఆచార్యులు డా.నాగేశ్వరరావు ఆమంచి చెబుతున్నారు. మానవుల ఆరోగ్యంపై సూక్ష్మ కీటకాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆయన ప్రయోగాల ద్వారా నిరూపించారు. ‘సూక్ష్మకీటకాలు అరటిపండ్లు, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష పండ్లపై వాలి రంధ్రాలు చేసి అందులోని పిండి పదార్థాలు, సుక్రోజ్‌లను తింటాయి. వాటిని మనం తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది. చిన్నారులు, వయోధికులకు వాంతులు, విరోచనాలతో పాటు అజీర్తి సమస్యలూ వస్తాయి. ఈ కీటకాలు గుంపుగా ఉన్నప్పుడే కంటికి కనిపిస్తాయి. పండ్లను మనం తినాలనుకుంటే సూక్ష్మకీటకాలు వాలిన ప్రాంతమంతా తీసెయ్యాలి. లేదా మరోసారి శుభ్రంగా కడిగి తినాలి’ అని ఆయన సూచిస్తున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.