ఆనెలు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గించుకోవచ్చు

www.mannamweb.com


కాళ్లలో చాలా మందికి ఆనెలు వస్తూ ఉంటాయి. ఆనెలు ఉంటే ఎక్కువ సేపు నడవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరో సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. చెప్పులు లేకుండా నడిచేవారికి, డయాబెటీస్‌తో బాధ పడేవారికి ఈ ఆనెలు అనేవి ఎక్కువగా వస్తాయి.

చాలా మందికి వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలీదు. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేశారంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.

నిమ్మకాయతో మనం ఆనెలను తగ్గించుకోవచ్చు. నిమ్మకాయని రెండు ముక్కలుగా కోసి.. రసాన్ని గిన్నెలోకి తీసుకోండి. ఈ రసాన్ని ఆనెలపై అప్లై చేయండి. ఇలా ప్రతి రోజూ చేయండి. ఇలా చేస్తే ఆనెలు గట్టిపడి.. కాయలా రాలిపోతుంది. దీంతో మీకు కూడా ఉపశమనంగా ఉంటుంది,

జిల్లేడు పాలతో కూడా ఈ ఆనెలను తగ్గించుకోవచ్చు. జిల్లేడు పాలు తీసుకుని ఇందులో కొద్దిగా పసుపు కలిపి ఆనెలపై రాయండి. ఆ తర్వాత ప్లాస్టర్‌తో కట్టేయండి. ఇలా వారం రోజులు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

ఉదయం, సాయంత్రం ఆనెలను గోరు వెచ్చటి నీటితో కడగండి. ఆ తర్వాత కలబంద గుజ్జు రాయండి. ఇలా కొద్ది రోజులు చేస్తే ఆనెలు తగ్గుతాయి. అలోవెరా జెల్‌తో కూడా ఆనెల సమస్యలను తగ్గించుకోవచ్చు. గోరు వెచ్చటి నీటిలో వంట సోడా కలిపి ఆనెలకు రాసినా తగ్గుతాయి.

ఉల్లిపాయలతో కూడా మనం ఆనెల సమస్యలను వదిలించుకోవచ్చు. ఉల్లిపాయని గుజ్జులా మిక్సీ పట్టాలి. ఈ గుజ్జును ఆనెలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి.. ఓ క్లాత్ కట్టి ఉంచండి. కాలిని నేలపై పడకుండా చూసుకోండి. ఇలా చేస్తే ఆనెలు తగ్గుతాయి.