హైదరాబాద్​ నుంచి శ్రీశైలం వెళ్తున్నారా..? మీకో గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. అంతటి మహిమాన్విత క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. అటు ఏపీతో పాటు హైదరాబాద్ నుంచి శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తుంటారు.


అందువల్ల హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే హైదరాబాద్ టూ శ్రీశైలం మధ్య దాదాపు రూ. 7,668 కోట్లతో నాలుగు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం అందుతోంది. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా 54.915 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉండనుంది. ఇందులో 45.19 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గం. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణ – ఆంధ్రప్రదేశ్​ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది.

హైదరాబాద్- శ్రీశైలం హైవే ‘ఎలివేటెడ్ కారిడార్’ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్- శ్రీశైలం మధ్య ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణ – ఆంధ్రప్రదేశ్​ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాక కృష్ణా నదిపై భారీ సస్పెన్షన్ వంతెనను కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి అమ్రాబాద్‌ మండలం మన్ననూరు నుంచి ప్రారంభం అయి శ్రీశైలం పాతాళగంగ వరకు నాలుగు వరుసలతో 30 అడుగుల ఎత్తులో ఈ రహదారిని నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రమాదకరమైన ఘాట్ రోడ్లు, మలుపుల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ కొత్త కారిడార్ వల్ల ప్రయాణం సురక్షితంగా, వేగంగా ఉంటుంది. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో 300 మీటర్లను వయాడక్ట్‌ గా పరిగణించనున్నారు. ఈ కారిడార్‌ పూర్తయితే నల్లమల అటవీ ప్రాంతం నుంచి నేరుగా శ్రీశైలానికి వెళ్లవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

దీంతోపాటు తెలంగాణలో మరో కీలక జాతీయ రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం- వరంగల్ మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీలను అధికారులు నియమించనున్నారు. ఇందుకోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు. అంతేకాక హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా నిర్మించాలని, అదనంగా సర్వీస్ రోడ్డును రెండు వరుసలకు పెంచాలని కేంద్ర మంత్రి గడ్కరీని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.