ప్రస్తుతం తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యింది. ఈ నెల అంటే కొత్తగా పెళ్లయిన జంటలకు అస్సలు నచ్చదు. పెళ్లయిన మొదటి ఏడాది వచ్చే ఆషాఢ మాసంలో కచ్చితంగా భార్య పుట్టింటికి వెళ్లిపోతుంది. ముఖ్యంగా వ్యవసాయం పనులకు మగవాళ్లు వెళ్లరనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీ తీసుకొచ్చారని పలువురు ప్రవచనకారులు చెబుతూ ఉంటారు. అయితే ఆనవాయితీలకు కచ్చితంగా పాటించే తెలుగు రాష్ట్ర ప్రజలు వ్యవసాయం చేసినా.. చేయకపోయినా కచ్చితంగా ఆషాఢమాసం భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అయితే ఈ నెలలో కొంతమంది హనీమూన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లయిన జంటలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మంచి పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
లోనావాలా
మహారాష్ట్రలో సందర్శించడానికి చాలా అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో మీ భాగస్వామితో కలిసి సందర్శించాలని ప్లాన్ చేస్తే లోనావాలా మిమ్మల్ని అమితంగా ఆకట్టకుంటుంది. లోనావాలా మహారాష్ట్రలోని అందమైన హిల్ స్టేషన్‌గా ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు జంటలను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడికి వెళ్తే జీవితాంతం గుర్తుంచుకునే మెమోరీలను ఆశ్వాదించవచ్చు. రాజ్మాచి పాయింట్, లయన్స్ పాయింట్, లోనావాలా లేక్ వంటి ప్రదేశాల్లో సేదతీరవచ్చు.
ఉదయపూర్
వర్షాల సమయంలో ఉదయపూర్ అందాలను మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. ఉదయపూర్ దేశంలోనే అత్యుత్తమ రొమాంటిక్ డెస్టినేషన్‌గా పరిగణిస్తారు. వర్షాకాలంలో ఈ నగరం అందం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. స్థానిక జంటలే కాకుండా విదేశీ జంటలు కూడా ఉదయపూర్‌కు రాచరిక ఆతిథ్యాన్ని ఆస్వాదించడానికి చేరుకుంటారు. ఉదయపూర్‌లో మీరు మీ భాగస్వామితో కలిసి ఫతేసాగర్ లేక్, పిచోలా లేక్, లేక్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ వంటి శృంగార ప్రదేశాలను సందర్శించవచ్చు.