ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు ఆనందాన్ని కోల్పోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే.

కొన్ని సందర్భాల్లో ఆలోచనలు దారుణంగా వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా జీవితంలో ఏదైనా అనుకోని విషయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి.


అలాగే కొన్నిసార్లు ఏమి లేని విషయం గురించి ఎక్కువ ఆలోచించి ఆందోళన పడిపోతూ ఉంటారు కొందరు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు ఆలోచనల్ని కట్ చేసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ఇవి మీకు అతిని తగ్గించి.. ఆలోచించే విధానంలో మార్పులు తీసుకువస్తాయి.

తప్పో.. ఒప్పో..

ఆలోచించడాన్ని మీరు ఆపలేకపోతుంటే ఒక్క విషయాన్ని నోటిస్ చేయండి. మీరు అతిగా ఆలోచిస్తున్నప్పుడు అది మిమ్మల్ని బాధ పడేవైపునకు తీసుకువెళ్తుందా? లేదా మిమ్మల్ని సమస్య నుంచి బయటకు తెస్తుందా? ఈ రెండింటీలో తేడా గుర్తించినప్పుడు ఆలోచన ఈజీగా తగ్గుతుంది. సమస్యకు పరిష్కారం చూపించేది మంచిదే కానీ.. సమస్యను రెట్టింపు చేసే ఆలోచన అనవసరం అని గుర్తించండి.

రాసుకోరా సాంబా..

మీకు తెలుసా? మీలోని సగం ఆలోచనలు రాయడం ద్వారా తగ్గుతాయట. మనసులోని భారం పేపర్​ మీద పెట్టినప్పుడు రిలాక్స్ అవుతారు. మానసికంగా స్ట్రెస్ తగ్గుతుంది. రాయకుండా లోపలే ఉంచుకుంటే అది డ్రైన్ అవ్వకుండా ఆలోచల్ని రేకెత్తిస్తూ ఉంటుంది. లేదంటే మీరు ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్స్​తో కూడా మీ ఆలోచనలు పంచుకోవచ్చు. అయితే మీ ప్రశ్నలు రెట్టింపు చేసేవారితో కాకుండా ఏదొక బదులు ఇవ్వగలిగేవారితో పంచుకుంటే మంచిది.

టైమ్ లిమిట్

సమస్య వచ్చినప్పుడు ఆలోచించకుండా ఉంటే తప్పే. కానీ ఆలోచనలకి కూడా ఓ టైమ్ లిమిట్ పెట్టుకోండి. 5 నుంచి 10 నిమిషాలు దానిగురించి ఆలోచించండి. గుడ్, బ్యాడ్ అన్ని తెలుసుకోండి. తర్వాత మీరు దానిని వదిలేయండి. లేదా ఆ పనిని గుర్తురానివ్వని పనిపై ఫోకస్ చేయండి. వ్యాయామం, గేమ్స్ ఆడడం వంటివి చేయొచ్చు.

కంట్రోల్

ఏమి చేసినా ఆలోచనలు తగ్గట్లేదు అంటారు కొందరు. కానీ మీకు తెలుసా మీరు అనుకుంటే కచ్చితంగా వాటిని కంట్రోల్ చేయగలరు. ఒక ప్రాబ్లమ్​లో మీరు కంట్రోల్ చేయగలిగే విషయాలను నోట్ చేయండి. మీరు ఏమి చేసినా కంట్రోల్​ అవ్వని వాటి గురించి ఆలోచించి వేస్ట్. మెంటల్లీ క్లారిటీగా ఉన్నప్పుడు ఆలోచన అతిగా వెళ్లదు.

మెడిటేషన్

ఎన్ని చేసినా ఆలోచనలు ఆగట్లేదు అనుకున్నప్పుడు మెడిటేషన్ చేయండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ సమయంలో మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ప్రశాంతంగా ఉంటారు.

అలా.. ఎలా?

అలా చేస్తే.. అలా అయితే.. ఇలా జరిగితే.. అనే పదాలు భయాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి వాటిని కట్ చేసేయండి. జరిగేది జరగక మానదు. దానికి మీరు ఎంత వరకు ఎఫర్ట్స్ పెట్టగలరో గుర్తించండి.

అంత మంచికే..

మంచి జరిగినా.. చెడు జరిగినా దానిని స్వీకరించడం నేర్చుకోగలిగితే ఎలాంటి ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేయలేవు. కాబట్టి ఏ పరిస్థితిని అయినా ముందుగా యాక్సెప్ట్ చేసి తర్వాత పరిణామాలు యూనివర్స్​కి వదిలేయండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.