నిద్ర పోయే సమయంలో చాలా మంది రకరకాలుగా పడుకుంటారు. వెల్లకిలా, పక్కకు, బొర్లా తిరిగి ఇలా ఎవరికి నచ్చిన పోజ్‌లో వారు నిద్రిస్తూ ఉంటారు. ఇలా పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది.
కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతారు. అయితే కొన్ని రకాల స్లీపింగ్ పొజీషన్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బోర్లా తిరిగి పడుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై సైడ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. చాలా నస్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఇలా పడుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల వెన్నెముక, మెడపై ఎఫెక్ట్ పడుతుంది. ఇతర శరీర భాగాలపై కూడా ఒత్తిడి పడుతుంది. ఇవి దీర్ఘకాలిక నొప్పులకు దారి తీస్తుంది.
2. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల ముందు పొట్టపై ప్రభావం పడుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థకు ఆటంకంగా మారుతుంది. తిన్న ఆహారం త్వరగా అరగదు.
3. పొట్టపై పడుకోవడం వల్ల వెన్నెముకపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. సహజంగా ఉండే షేప్ పోతుంది. వక్రత ఏర్పడవచ్చు. బాడీ పెయిన్స్ ఎక్కువగా పడతాయి.
4. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల మీ తలను ఒక వైపు తిప్పి పడుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మెడకు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. కానీ తరచూ పడుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
5. బోర్లా తిరిగి పడుకోవడం వల్ల శరీర భాగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దీని వల్ల ఉదయం మీరు లేచేసరికి నొప్పులు అధికంగా వస్తాయి.
ఈ చిట్కాలు ట్రై చేయండి:
మీరు బోర్లా పడుకోకుండా ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలు ట్రై చేయండి. దీని వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. మీ తల కింద దిండును వేసుకోకండి. దీని వలన బోర్లా పడుకునే అలవాటు తగ్గిపోతుంది. తలదిండు వేసుకోవడం వల్ల మెడ నరాలు ఇబ్బంది పెడతాయి. మీ వెన్నెముక సరిగా ఉండాలంటే.. మీ కటి ప్రాంతం కింద దిండును ఉంచండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)