ఒత్తిడి, ఆందోళన, ఓవర్ థింకింగ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ 5-5-5 టెక్నిక్‌ ట్రై చేయండి

క్రష్‌తోనో, గర్ల్‌ఫ్రెండ్‌తోనో లేదా పార్ట్‌నర్‌తోనో కొన్నిసార్లు సరదాగా టెక్ట్స్ చేస్తుంటారు. మెసేజ్ చేసేటప్పుడు వాటిని టైప్ చేసే దగ్గర్నుంచి ఏ ఎమోజీలు పెట్టాలి?
వేటిని పంపిస్తే అవతలివారు ఇంప్రెస్ అవుతారు? వంటి ఆలోచనలు మొదలవుతాయి. ఈ క్రమంలో మెసేజ్ టైప్ చేయడం, వెంటనే డిలీట్ చేయడం, కొన్నిసార్లు రీఫ్రేజ్ చేయడం.. ఇలా అతిగా ఆలోచిస్తారు. ఈ అతి ఆలోచన క్రమంగా ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తుంది. మరి దీని నుంచి తేరుకోవడం ఎలా? ఆలోచనల సుడిగుండంలో నుంచి క్షణాల్లో బయట పడటానికి 5-5-5 అనే ఓ చిన్న టెక్నిక్ ఉంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ టెక్నిక్ గురించి తెలుసుకుందాం.


ఈ 5-5-5 టెక్నిక్ పూర్తిగా మెంటల్ ఫిట్‌నెస్‌కి సంబంధించినది. ఇదొక రకమైన గ్రౌండింగ్ టెక్నిక్ అని మానసిక నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా, ఆందోళనతో నిండిన లేదా బాధ కలిగించే ఆలోచనలను తగ్గించడం, ఓవర్ థింకింగ్‌ని అధిగమించడానికి హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా.. ఓ ప్రశ్న వేసుకోవడమే. రాబోయే 5 నిమిషాలు, 5 రోజులు లేదా 5 ఏళ్లలో నాకు ముఖ్యమా? అని ప్రశ్నించుకోవాలి. అంతే.. ఈ టెక్నిక్ మనసుకు కొంత స్వాంతన ఇస్తుంది. సమయం గురించి ఆలోచించే విధానాన్ని మార్చుకున్నప్పుడు మన మెదడు భావోద్వేగం నుంచి లాజికల్ థింకింగ్‌కి మారతాయి. చిన్న సమస్యలను కూడా పెద్దగా చూపించే ఓవర్‌థింకింగ్.. ‘ఐదు రోజుల్లో ముఖ్యమా?’ అని ప్రశ్నించుకోవడం వల్ల మనస్సుని తిరిగి ట్రాక్‌లోకి తెస్తుంది.

మణిపాల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ సైకియాట్రీగా పనిచేస్తున్న డా. భవ్య కె బైరీ దీనిపై స్పష్టంగా ‘ఇండియా టుడే’తో వివరించారు. ‘మీరు క్షణంలో మాత్రమే పెద్దగా అనిపించే చిన్న విషయంపై దృష్టి పెడుతున్నారంటే అది అతిగా ఆలోచించడమే. సమస్య ఏదైనా దాని గురించి ఓ 5 నిమిషాల పాటు వాయిదా వేసి చూడాలి. అప్పుడు అది మనసులో నుంచి తొలగిపోతే అవసరమైన దానికంటే తీవ్రంగా స్పందిస్తున్నారని మనస్సు గ్రహిస్తుంది. ఇలా, 5-5-5 రూల్ మీకు తేడాను గుర్తించడంలో హెల్ప్ చేస్తుంది. ఆందోళనతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుంది’ అని చెప్పుకొచ్చారు.

గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్స్‌లోని మెంటల్ హెల్త్, బిహేవియరల్ సైన్స్ హెడ్ కన్సల్టెంట్ డాక్టర్ రాహుల్ చందోక్ వివరిస్తూ.. ‘ఒక వ్యక్తి ఎంత ఆందోళనతో ఉన్నారు, దానిని ఎలా ఎదుర్కొంటాడనే విషయంపై ఈ టెక్నిక్ పనిచేయడం ఆధారపడుతుంది. కొంతమందికి, ఇది ఇన్‌స్టంట్ రిలీఫ్‌ని అందిస్తుంది. ఆలోచనల లూప్‌లో నుంచి ప్రజెంట్‌లోకి తీసుకొస్తుంది. మరికొందరికి, ఇది మైండ్‌ఫుల్‌నెస్, కాగ్నిటివ్ బిహేవియరల్ స్ట్రాటజీ, జర్నలింగ్‌తో కలిపి చేస్తే దీర్ఘకాలంలో బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి, స్థిరంగా ఉండటమే ఓవర్ థింకింగ్‌ సమస్యను అధిగమించేందుకు హెల్ప్ చేస్తుంది. ఈ టెక్నిక్‌తో అది సాధ్యం. దీన్ని తరచుగా ప్రాక్టీస్ చేస్తే ఆలోచించే విధానం మారడమే గాక, కాలక్రమేణా మానసికంగా స్ట్రాంగ్ చేస్తుంది.’ అని వివరించారు. అంటే, ఈ 5-5-5 రూల్ యాంగ్జైటీకి ఒక ఫస్ట్ ఎయిడ్‌లా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.