రోజూ రాగి జావ తీసుకుంటున్నారా, అయితే ఇది తెలుసుకోవాల్సిందే

రాగి జావ. దీని ద్వారా ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువుకు చెక్‌ చెబుతుంది. కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది. ప్రతీ రోజు ఉదయం సమయంలో రాగి జావ తీసుకోవటం ద్వారా శక్తిని ఇస్తుంది.


మధుమేహం ఉన్నవారు కూడా రాగిజావను తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే, ఇదే సమయంలో షుగరు పేషెంట్స్ రాగి జావ తాగే విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

రాగిజావ. చాలా మంది రాగిజావను రోజూ తీసుకుంటున్నారు. అయితే, షగరు బాధితుల విషయం లో రాగి జావ పైన అనేక అపోహలు ఉన్నాయి. వీరు ఏ మోతాదులో రాగి జావ తీసుకోవటం ద్వారా ప్రయోజనం ఉంటుంది.. రాగి జావ తీసుకుంటే షుగరు పెరుగుతుందా అనే అనుమానం ఉంది. దీనికి నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. సాధారణంగా, రాగి జావ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. నిజానికి, ఇతర శుద్ధి చేసిన ధాన్యాలతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి పానీయంగా చెబుతున్నారు. రాగి జావలోని గ్లూకోజ్ రక్తంలోకి చాలా నెమ్మదిగా, క్రమంగా విడుదలవుతుందని వివరిస్తున్నారు. రాగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీనివల్ల గ్లూకోజ్ శోషణ కూడా నెమ్మదిగా జరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.

ఇక, రాగులలో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే.. షుగరు బాధితులు జావ తయారీలో చక్కెర, బెల్లం, తేనె లేదా ఇతర కృత్రిమ స్వీటెనర్లను అస్సలు వాడకూడదు.రాగి జావలో ఉప్పు, మజ్జిగ లేదా పెరుగు కలిపి తీసుకోవడం ఉత్తమం. పెరుగు లేక మజ్జిగలో ఉండే ప్రోటీన్ మరియు కొవ్వు జావ యొక్క గ్లైసెమిక్ ప్రభావాన్ని మరింత తగ్గిస్తుంది. ఉదయం అల్పాహారంలో ఒక కప్పు అంటి సుమారు 150-200 మి.లీ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువై షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం అవకాశం ఉంటుంది. రాగి జావతో పాటు లేదా దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, వంటివి కలపడం మంచిది. రాగుల్లో కూడా కార్బోహైడ్రేట్లు ఉంటాయి కాబట్టి, అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే సరిపోతుంది. రాగి జావ డయాబెటిస్ ఉన్నవారికి దివ్య ఔషధం వలె పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.