ముఖంపై ట్యాన్ తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో అదిరిపోయే బెనిఫిట్స్

సుపు, శనగపిండి, పెరుగు, నిమ్మరసం ఇవన్నీ మీ ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులే. వీటితో మీ ముఖంపై ఉన్న ట్యాన్‌ని సులభంగా తొలగించుకోవచ్చు. ముఖంపై ట్యాన్‌ తగ్గాలంటే..
దానిపై పెరుగు, కొద్దిగా పసుపు కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ట్యాన్‌ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.


కొంతమందికి ముఖంపై మాత్రమే కాకుండా మెడ, చేతులు, కాళ్లపై కూడా ట్యాన్‌ కనిపిస్తుంది. దీనికి కొద్దిగా పచ్చిపాలు తీసుకుని అందులో పసుపు, కొద్దిగా శనగపిండి వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ఎక్కడైతే ట్యాన్‌ ఉంటుందో అక్కడ రాసి కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్‌ సమస్య తొలగిపోతుంది.

కలబంద గుజ్జుతో కూడా ట్యాన్‌ను తొలగించుకోవచ్చు. ముఖంపై ట్యాన్‌ ఉన్న చోట కలబంద గుజ్జును అప్లై చేయాలి. ఆ తర్వాత అరగంట ఉంచి చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రెండురోజులకు ఒకసారి చేస్తే ట్యాన్‌ తొలగిపోతుంది. నారింజ తొక్కలతో కూడా ట్యాన్‌ను తగ్గించుకోవచ్చు. నారింజ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకుని అందులో పాలు, రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ట్యాన్‌ ఉన్న చోట రాసుకుని అరగంట ఆగి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్‌ సమస్య తగ్గిపోతుంది.

ఒక బౌల్‌లో నిమ్మరసం, తేనె కలిపి ట్యాన్‌ ఉన్న చోట రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా ట్యాన్‌ తగ్గుతుంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ట్యాన్‌ను తగ్గించుకోవచ్చు. వీటితోపాటు బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. అంతేకాకుండా గొడుగు, టోపీ, సన్‌ గ్లాసెస్‌, చేతులకు గ్లౌజులు వేసుకోవడం వంటివి చేయడం వల్ల ట్యాన్‌ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ చిట్కాలను పాటించినా ఫలితం లేకపోతే మాత్రం సమీపంలోని డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.