బ్రెడ్ ఆమ్లెట్ (Bread Omlette) ప్రోటీన్, ఎనర్జీ ఇస్తుంది. మల్టీ గ్రెయిన్ బ్రెడ్, తక్కువ నూనె వాడితే మంచిది. సరైన లిమిట్‌లో, కూరగాయలతో కూడా తీసుకోవచ్చు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజువారీ ఆహారంలో కీ రోల్ పోషిస్తుంది. ఇది డే స్టార్ట్ చేయడానికి అవసరమైన ఎనర్జీతో పాటు ఉత్సాహాన్ని అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తినాలి. అయితే, చాలా మంది తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యి, కడుపు నింపే రెసిపీలు తినడానికి ప్రయారిటీ ఇస్తుంటారు. ముఖ్యంగా బ్రెడ్ ఆమ్లెట్ (Bread Omlette) అల్పాహారంగా తింటున్నారు. ఇది టేస్టీగా ఉండటంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అయితే రోజూ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ప్రోటీన్ రిచ్ కాంబినేషన్. గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. డైలీ మార్నింగ్ ఎగ్స్, వీటి నుంచి బాడీకి అందే ప్రోటీన్‌తో మజిల్ రిపేర్‌తో పాటు మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. పైగా, గుడ్లలోని అమైనో ఆమ్లాలు జుట్టు, గోర్లు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ వీటిని ఎలా తింటున్నామనే విషయాన్ని బట్టి బెనిఫిట్స్ ఉంటాయి. సాధారణంగా వారానికి రెండుసార్లు గుడ్డు తింటే సరిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఈ లిమిట్ దాటితే డేంజర్. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు వారానికి 7కు మించి గుడ్లు తింటే గుండె జబ్బుల ప్రమాదం ఉంటుందని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం చెబుతోంది.
బ్యాలెన్స్‌డ్ ఫుడ్..ఆమ్లెట్‌లో హై క్వాలిటీ ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ B12, D ఉంటాయి. ఎనర్జీని అందించే కార్బోహైడ్రేట్లు ఉండే బ్రెడ్‌తో కలిపి ఆమ్లెట్ తింటే బాడీకి కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, విటమిన్స్ అందుతాయి. అయితే, బ్రెడ్ ఆమ్లెట్ హెల్త్ వాల్యూ.. బ్రెడ్ రకం, ఆమ్లెట్ వండే విధానంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మల్టీ గ్రెయిన్ బ్రెడ్ అయితే ఫైబర్‌ను అందించి డైజేషన్‌కి హెల్ప్ చేస్తుంది. కానీ, మైదాతో తయారైన బ్రెడ్‌లో ఫైబర్ ఉండదు. పైగా ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని త్వరగా పెంచుతుంది. మరోవైపు, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే నూనెలను ఆమ్లెట్ తయారీలో వాడితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యానికి ముప్పుగా మారొచ్చు.
బ్రెడ్ సెలక్షన్బ్రె డ్ ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని అందించినా, చాలా ప్యాకేజ్డ్ బ్రెడ్లలో ప్రిజర్వేటివ్స్, యాడెడ్ షుగర్స్, హై సోడియం కంటెంట్ ఉంటాయి. షెల్ఫ్ లైఫ్‌ని పొడిగించడం కోసం ఇలా చేసిన వాటిని తింటే బాడీపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ఈ బ్రెడ్‌ను రెగ్యులర్‌గా తింటే కడుపు ఉబ్బరం, దీర్ఘకాలంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి, తృణధాన్యాలతో చేసినవి వాడటం మంచిది.
టైమింగ్స్ ఇంపార్టెంట్ సరైన సమయంలో, లిమిట్‌లో తింటే బ్రెడ్ ఆమ్లెట్ మంచిదే. పాలకూర, టమాట వంటి కొన్ని కూరగాయలను ఆమ్లెట్‌లో యాడ్ చేసుకుంటే మరిన్ని పోషకాలు అందుతాయి. దీంతో పాటు, గుడ్లు, బ్రెడ్‌లలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల తినడానికి ముందు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా నిమ్మకాయ రసం తాగితే డైజేషన్ ఈజీ అవుతుంది.
బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ బ్రెడ్ ఆమ్లెట్ ఇన్‌స్టంట్ ఎనర్జీ అందించడంతో పాటు అందులోని ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. డైజేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే, వైట్ బ్రెడ్‌లో పోషకాలు తక్కువగా ఉండటం, క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి పోషకాలు పూర్తిగా అందవు. పైగా, నూనె ఎక్కువైతే అది కొవ్వులను పెంచుతుంది. రెగ్యులర్‌గా దీనిని తింటే పోషకాల లోటు ఏర్పడుతుంది.

































