వాటర్ హీటర్ వాడుతున్నారా..? అయితే ఈ విషయం గుర్తు పెట్టుకోండి..

www.mannamweb.com


చలికాలం వచ్చింది. ఉదయాన్నే స్నానం అంటే భయం వేస్తుంది చాలామందికి. అది కూడా చల్లటి నీళ్లలో స్నానం చేసేందుకు చాలా మంది సంకోచిస్తారు. దీని వల్ల వేడి నీళ్లలో స్నానం చేయడానికి ఇష్టపడతారు.

అయితే ఈ వేడి నీటి కోసం గతంలో కట్టెల పోయ్యి వాడేవారు వేడినీళ్లతో స్నానం చేసేవారు. ఆ తర్వాత గ్యాస్ స్టవ్స్ ద్వారా నీటిని వేడి చేయడం ప్రారంభించాము.

ఇక ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్ది రకరకాల సాధనాలు వచ్చాయిన వాటర్ హీటర్లు.. దానిలోరకరకాలు వస్తున్నాయి. ఇంట్లో హీటర్ లేకపోతే వేడి నీళ్ల కోసం గ్యాస్ స్టౌవ్ లు వాడుతుంటారు. కాని అలా వాడటం వల్ల సిలిండర్ వారం రోజుల్లో గ్యాస్ అయిపోతుంది.

దీనికి ఒక పరిష్కారం తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు వేడెక్కడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంటికి గీజర్ లేదా సోలార్ వాటర్ హీటర్ కొనుగోలు చేయలేని వారు అధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు.

కానీ తక్కువ ధరకే వాటర్ హీటర్లు వాడుతున్నారు. వాటర్ హీటర్ ఉపయోగించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రాణ నష్టం తప్పదు. బాత్‌రూమ్‌లలో వాటర్‌ హీటర్లు వాడకూడదు. తడి ప్రాంతం కావడంతో షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. వైర్ పూర్తిగా నీటిలో మునిగిపోయిన తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేయడం అవసరం.

ప్లాస్టిక్ బకెట్లలో వాటర్ హీటర్లను ఏమాత్రం ఉపయోగించవద్దు. ఇలా వాడటం వల్ల.. పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు ఐరన్ బకెట్లు కూడా దీనికి వాడవద్దు.. ఎందుకుంటే ఇనుము ద్వారా షాక్ వస్తుంది. ఇక వాటర్ హీటర్ అంటే ఎటువంటి బకెట్స్ వాడాలంటే.. స్టీల్ మరియు అల్యూమినియం ఇతర మెటల్ పాత్రలను మాత్రమే ఉపయోగించాలి.

చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. నీళ్లు వేడి అయ్యాయా లేదా అని వెంటనే ఆలోచించకుండా నీళ్లలో వేలుక పెడుతుంటారు. కాని అలా చేయకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే షాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. వాటర్ హీటర్‌ను ఆపివేసిన 10 నిమిషాల తర్వాత నీటి నుండి హీటర్ రాడ్‌ను తొలగించడం ఉత్తమం.