గూగుల్ క్రోమ్.. గూగుల్ తయారు చేసిన వెబ్ బ్రౌజర్. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది ఉపయోగించే సర్చింగ్ యాప్. పలు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో సైతం ఎంతో సమర్థవంతంగా పనిచేయగలిగే క్రోమ్ ను 2008లో గూగుల్ తయారు చేసింది.
ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో ఎంతో సమర్థవంతంగా పనిచేసే గూగుల్ క్రోమ్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. కొన్ని విషయాలు తెలుసుకోకపోతే అన్నే నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రోమ్ ఉపయోగిస్తున్నవారు కొన్ని సెట్టింగ్స్ కచ్చితంగా మార్చుకోవాలి లేదంటే ప్రమాదంలో పడినట్టే.
గూగుల్ క్రోమ్ మీకు కెమెరాను వాడేస్తుందని విషయం తెలుసా..? మీరు చేసే ప్రతీ విషయాన్ని పర్యవేక్షిస్తుంది. మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎక్కడికి వెళితే అక్కడికి కొన్ని సైట్స్ కూడా వచ్చేస్తున్నాయి. దాన్లో మీరు చేసే ప్రతీ పని రికార్డు అవుతుంది. నమ్మలేకపోతున్నారు కదా.. కానీ నిజం. గూగుల్ క్రోమ్ లో బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న కొన్ని తెలియని వెబ్సైట్స్ మీరు చేసే ప్రతి పనిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రతీ విషయాన్ని కెమెరాతో చూసేస్తున్నాయి. ఈ విషయం ఇప్పటివరకు తెలియకపోతే ఇకనైనా కచ్చితంగా జాగ్రత్త పడండి.
సైబర్ క్రైమ్స్.. విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతీ విషయంలోనూ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ వాడుతున్న వినియోగదారులు ఈ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందే. నిజానికి క్రోమ్ ఉపయోగిస్తున్న వినియోగదారులు కొన్ని సెట్టింగ్స్ ను అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొబైల్ కెమెరా నిరంతరాయంగా పని చేస్తూ తెలియని సైట్స్ కు సపోర్ట్ చేస్తుంది. క్రోమ్ బ్యాగ్రౌండ్ లో రన్ అవుతున్న కొన్ని సైట్స్ నిరంతరాయంగా మీ కెమెరాను పర్యవేక్షిస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఇందుకోసం ఏం చేయాలంటే..
⦿ క్రోమ్ ఉపయోగిస్తున్న వినియోగదారులు కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి.
⦿ ముందుగా క్రోమ్ ను ఓపెన్ చేయాలి.
⦿ కుడి వైపు పైన కనిపించే మూడు డాట్స్ ను క్లిక్ చేయాలి
⦿ ఇందులో సెట్టింగ్స్ ను క్లిక్ చేయాలి
⦿ అక్కడినుంచి సైట్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి.
⦿ అందులో ఉండే కెమెరాను క్లిక్ చేసి దాన్ని ఆపేయాలి.
⦿ ఈ సమయంలో అక్కడ ఏమైనా లింక్స్ కనిపిస్తే వాటిని వెంటనే తీసేయాలి.
ఇప్పటివరకు మీ కెమెరాలో జరిగే ప్రతీ విషయాన్ని ఆ సైట్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి అనే విషయం తెలిసి షాక్ అయ్యే విషయం నిజమైనప్పటికీ ఇక మీదటైనా జాగ్రత్తపడాలి. ఇలా కెమెరాను chrome లో ఆపేయటం వల్ల ఇకపై వేరే ఎవరూ చూసే అవకాశం ఉండదు. ఇక ఇవి మాత్రమే కాదు క్రోమ్ లో మార్చాల్సిన ఎన్నో విషయాలు చాలామందికి తెలియదు. క్రోమ్ ఉపయోగిస్తున్న వారు థర్డ్ పార్టీ కుకీస్ ను సైతం బ్లాక్ చేయడం మంచిది. ఇక దీంతో పాటు హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేయటంతో పాటు సైట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి డేటాను క్లియర్ చేయడం వల్ల బ్యాక్ గ్రౌండ్ లో స్టోరేజ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.