నెలల తరబడి ఒకే టూత్‌బ్రష్‌ వాడుతున్నారా..? అయితే, మీ పని ఖతం..! ఏం జరుగుతుందో తెలిస్తే

www.mannamweb.com


నెలల తరబడి ఒకే టూత్‌బ్రష్‌ వాడుతున్నారా..? అయితే, మీ పని ఖతం..! ఏం జరుగుతుందో తెలిస్తే..

ప్రతి ఒక్కరూ టూత్ బ్రష్‌ వినియోగంతోనే వారి రోజును ప్రారంభిస్తారు. కాబట్టి, మనం ఎలాంటి టూత్ బ్రష్ ఉపయోగించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక టూత్ బ్రష్ మూడు నెలలకు మించి వాడకూడదని అనేక పరిశోధనల్లో రుజువైంది. ఎందుకంటే ఇది వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది.

ప్రతి వ్యక్తికి నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. మధుమేహం, గుండె జబ్బులను నివారించడానికి మీరు మీ నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ నోటి ఆరోగ్యానికి మంచి టూత్ బ్రష్ ఉపయోగించటం చాలా ముఖ్యం. ఎందుకంటే అది పాడైతే మీ దంతాలు దెబ్బతింటాయి. అనేక ఇతర నోటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. టూత్ బ్రష్ విషయానికి వస్తే, టూత్ బ్రష్ ఎన్ని రోజుల తర్వాత మార్చాలి..? అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? దానికి సమాధానం ఇక్కడ తెలుసుకుందాం..

ఒక బ్రష్‌ను మూడు నెలలకు మించి ఉపయోగించకూడదు. ఒక్కో బ్రష్ ఎక్కువ కాలం వాడకూడదని ప్రతి డెంటిస్ట్ చెబుతారు. మూడు నెలల తర్వాత బ్రష్ పూర్తిగా పనికిరాదు. ఎందుకంటే దీని ఉపయోగం పంటి నొప్పి, రక్తస్రావం సమస్యలను కలిగిస్తుంది. మీ బ్రష్ పాడైపోయిందనడానికి ఇది సంకేతం.

జలుబు, దగ్గు లేదా ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత మీరు చేయవలసిన మొదటి పని మీ టూత్ బ్రష్‌ను మార్చడం. ఎందుకంటే మీ టూత్ బ్రష్ వైరస్లు, బాక్టీరియాను మోస్తాయి. దీంతో మళ్లీ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. కనుక అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కొత్త టూత్ బ్రష్‌ని ఉపయోగించడం వల్ల దంతాలతో పాటు పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు.

పెద్దల టూత్ బ్రష్‌ల కంటే చిన్న పిల్లల టూత్ బ్రష్‌లను మరింత త్వరగా మార్చాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి చిన్నవిగా, మృదువుగా ఉంటాయి. పిల్లలు వాటిని నోటిలో పెట్టుకుని నమిలేస్తుంటారు. దీంతో మరింత త్వరగా పాడైపోతుంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల టూత్ బ్రష్ ఎలా పని చేస్తుందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

దంత వైద్యుల సలహా మేరకు.. ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు టూత్ బ్రష్‌లను మార్చాలి. లేదా, టూత్ బ్రష్ బ్రిస్టల్స్ మూడు నెలల ముందుగానే విరిగిపోయినా, లేదా చిప్ అయినా సరే..మీరు వెంటనే ఆ బ్రష్‌ని మార్చేయాలి. ఈ రకమైన టూత్ బ్రష్‌ను ఉపయోగించడం వల్ల కావిటీస్, చిగుళ్ల వ్యాధికి దారి తీసే అవకాశం ఉంటుంది.