కేంద్రం కీలక నిర్ణయం.. ఇద్దరు తెలుగు క్రీడాకారులకు అర్జున అవార్డులు

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దేశం తరఫున వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న (Rajiv Khel Ratna) పురస్కారాలతో పాటు అర్జున అవార్డు(Arjuna Award)లను కూడా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ(Union Ministry of Sports) ప్రకటించింది.

ఇందులో భాగంగా ఇద్దరు తేజాలు ఎంపిక అయ్యారు. వారిలో అథ్లెటిక్స్ విభాగం(Athletics Department)లో యర్రాజి జ్యోతి(Yarraji Jyoti), పారా అథ్లెటిక్స్ నుంచి తెలంగాణకు చెందిన జివాంజి దీప్తి(Jivanji Deepti)లు అర్జున అవార్డుకు ఎన్నికయ్యారు. కాగా జివాంజి దీప్తి పారాలంపిక్స్‌లో మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం(Bronze medal) సాధించింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరికి కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఈ క్రీడా అవార్డులను ప్రదానం చేయనున్నారు.