చెరకు సాగులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. మహారాష్ట్ర రైతుల నూతన ఒరవడి

మహారాష్ట్ర రైతులు చెరకు సాగుకు ఏఐని ఉపయోగిస్తూ సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం.


ఏఐ లేని రంగమేది..? అంటే సమాధానం కష్టమే..! అన్నింటా నాదే హవా అంటూ క్రమంగా విస్తరిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భూగర్భం మొదలు, ఆకాశం వరకు జరిగే అన్ని రకాల ప్రయోగాల్లో తనదైన మార్క్ చూపిస్తూనే ఉంది. వ్యవసాయరంగంలోనూ అద్భుత ఫలితాలు అందిస్తోంది. దాన్ని మరింతగా అందిపుచ్చుకున్న మహారాష్ట్ర రైతులు పంట దిగుబడి సహా, ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి 30 శాతానికి పైగా అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. చెరకు సాగుకు ఏఐని ఉపయోగిస్తూ సాగులో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం..