Arunachalam: అరుణాచలం వెళ్తున్నారా..? గిరి ప్రదక్షిణ టైంలో చాలా మంది తెలియక చేసే తప్పు అదేనట

Arunachalam: అరుణాచలం వెళ్తున్నారా..? గిరి ప్రదక్షిణ టైంలో చాలా మంది భక్తులు తెలియక చేసే తప్పులు ఉంటాయట. అసలు అరుణాచల గిరిప్రదిక్షణలో చేసే తప్పులేంటి…? ఎలాంటి తప్పులు చేయకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకునే మార్గాలు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.


అరుణాచల గిరి ప్రదక్షిణకు ఈ మధ్య కాలంలో భక్తులు పెద్ద ఎత్తున తరతి వెళ్తున్నారు… మామూలు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటే.. పౌర్ణమి సమయంలో లక్షల్లో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణాచలం కొండ హిమాలయాల కన్నా పూర్వమైనదిగా భక్తులు బావిస్తుంటారు. అరుణగిరలోనే శివుడు కొలువై ఉంటాడని రమణ మహర్షి కూడా అదే బోధించేవారని అంటుంటారు. అందుకే అరుణగిరికి ప్రదక్షిణ చేస్తే సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడికే చేసినంత పుణ్యం వస్తుందంటారు. మనిషి జీవితంలో చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడట. మనిషి అరుణచలేశ్వరుడి దర్శనం ముందు.. అరుణాచలేశ్వరుడి దర్శనం తర్వాత ఆ గీత మధ్యలో ఉంటుందటని పండితులు చెప్తుంటారు. అలాంటి అరుణాచలంలో తెలియక చాలా మంది తప్పులు చేస్తుంటారట. ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందా.. అలాగే అరుణాచలంలో చేసే మంచి పనులేంటో కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

అరుణాచలంలో చేయాల్సిన పనులు:
అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు శివనామస్మరణ మాత్రమే చేస్తుండాలి. లేదంటే అరుణాచల శివ స్మరణ చేయాలట. ఇంకా చెప్పాలంటే అరుణాల గుడిలో కానీ గిరి ప్రదక్షిణ సమయంలో కానీ ఏఏ నామాలను స్మరించాలో సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారట. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారట. శోణాదీశుడు, అరుణా ద్రీశుడు, వాధీశుడు, జనప్రియుడు, ప్రసన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిప్రేయామృతేశానుడు, స్త్రీపుంభావప్రదాయకుడు, భక్త విఘ్నప్తి సంధాత, దీన బంధ విమోచకుడు, ముఖ రాంఘైంపతి, శ్రీమంతుడు, మృడుడు, ఆషుతోషుడు, మృగమదేశ్వరుడు, భక్తప్రేక్షణ కృత్, సాక్షి, భక్తదోష నివర్తకుడు, జ్ఞానసంబంధనాధుడు, శ్రీ హాలాహల సుందరుడు, ఆహవైశ్వర్య దాత, స్మర్త్యసర్వా ఘనాశకుడు, వ్యత్యస్తను త్యధ్వజధృక్, సకాంతి, నటనేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి,

నిరంజనుడు, జగన్నాధుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తాపరాధ సోడూడు, యోగీశుడు, భోగ నాయకుడు, బాలమూర్తి, క్షమామూర్తి, ధర్మ రక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్ష లాంచనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వవిఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతరహితుడు, శివకాముడు, స్వయంప్రభువు, సచ్చిదానంద రూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీసంగవామసుభగుడు, విధి, విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తి ధాత, భక్తవాంఛితదాయకుడు, ఆశ్చర్యవైభవుడు, కామీ, నిరవద్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వాయంభువుడు, గిరీశుడు, మృడుడు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణ లో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్ధన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారట.

చేయకూడదని పనులు:
అరుణాచలంలో కాలికి చెప్పులు లేకుండా అడుగుపెట్టాలట. దేవుడి గుడిలో కానీ దర్శన సమయంలో కానీ వెనక వారితో కానీ ముందు వారితో కానీ అదే పనిగా మాట్లాడటం చేయకూడదట. దేవుడి దర్శనం చేసుకుని గుడిలోంచి బయటకు వచ్చే వరకు దైవనామస్మరణ చేస్తూనే ఉండాలట. ఇక గిరి ప్రదక్షిణ సమయంలో కూడా చెప్పులు ధరించకూడదట. అలాగే వీలైనంత ఎక్కువగా గిరి ప్రదక్షిణ సమయంలో మౌనంగా ఉండాలట. అరుణాచల శి అనే మంత్రాన్ని స్మరించడం ఉత్తమంగా చెప్తుంటారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.