సీతాఫలంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అతిగా తింటే జీర్ణ సమస్యలు, వాంతులు వచ్చే అవకాశం ఉంది. విత్తనాలు విషపూరితం. సీతాఫలం పండు ఆరోగ్యానికి చాలా మంచిది.
అయినా, కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు, లేదా దీన్ని అతిగా తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. సీతాఫలం తీసుకోవడం ఎవరికి ప్రమాదకరమో, దీని దుష్ప్రభావాలు ఏమిటో చూద్దాం.
సీతాఫలం ఎవరు తినకూడదు?
అలెర్జీ సమస్యలు ఉన్నవారు:
కొంతమందికి సీతాఫలం తిన్న తరువాత దురద, దద్దుర్లు, చికాకు లాంటి అలెర్జీ సమస్యలు రావచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే ఈ పండు తినడం మానుకోవాలి.
జీర్ణ సమస్యలు ఉన్నవారు:
సీతాఫలంలో పీచు (ఫైబర్) శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని అతిగా తీసుకుంటే, జీర్ణ సంబంధిత సమస్యలు (Digestive Problems) వస్తాయి. కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, బిగుతుగా అనిపించడం, విరేచనాలు లాంటి సమస్యలు రావచ్చు.
విషపూరిత విత్తనాలు:
సీతాఫలం పండు ఆరోగ్యకరమే. కానీ, దీని విత్తనాలు విషపూరితం కావచ్చు. కాబట్టి, పండు తినేటప్పుడు విత్తనాలు మింగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
అధిక ఐరన్సమస్య ఉన్నవారు:
సీతాఫలం ఐరన్ (Iron) కు గొప్ప వనరు. కానీ, దీనిని మరీ అతిగా తింటే శరీరంలో ఐరన్ శాతం ఎక్కువై, కడుపులో నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపు పొరల వాపు, అల్సర్లు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
సీతాఫలం ప్రయోజనాలు:
సీతాఫలంలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఈ పండులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి.
గమనిక: ఈ వార్తలో అందించిన సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య చిట్కాలు, పోషకాహార నిపుణుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది. ఇది ఏ విధంగానూ వైద్య సలహా లేదా రోగ నిర్ధారణకు ప్రత్యామ్నాయం కాదు.
































