Ash gourd: బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అసలు వదులుకోరు

www.mannamweb.com


Ash gourd: బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు తెలిస్తే అసలు వదులుకోరు

బూడిద గుమ్మడికాయ.. ఇది గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ ఇంటి వెనకాలా తీగ అల్లుకుని పసుపు పచ్చటి పూలతో విరివిగా కాస్తుంటాయి. కానీ మనం వీటిని తినకుండా లైట్‌ తీసుకుంటాం.

కనీసం అటు వైపు చూడం. అలాంటి బూడిద గుమ్మడి కాయతో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా అందుతాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

బూడిద గుమ్మడిలో ప్రోటీన్లు, ఫైబర్‌, జింక్‌, కాల్షియం, ఐరన్‌తోపాటు విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6 వంటివి సమృద్ధిగా నిండి ఉన్నాయి.. వీటిలో 96 శాతం నీరు ఉండి డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది.

ఈ గుమ్మడి కూర ఇష్టం లేని వారు జ్యూస్‌గా చేసుకుని నిత్యం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ఉండే ఫైబర్‌ మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు తగ్గించుకోవచ్చు. జీర్ణ సమస్యలు నయమవుతాయి. మలబద్దకం, గ్యాస్‌, అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలను దృఢంగా తయారుచేస్తుంది. రక్తహీనత నుంచి బయటపడేందుకు వీటిలోని ఐరన్‌ సాయపడుతుంది.

పొట్టలో అల్సర్లు తగ్గుతాయి. కడపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. నిత్యం ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వైరస్లు, బ్యాక్టీరియల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ జ్యూస్‌లో అధికంగా ఉండే విటమిన్ సీ, బీటా కెరోటిన్‌లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. ఆందోళన, ఒత్తిడి వంటి వాటితో బాధపడే వారు ఈ జ్యూస్ ను ప్రతిరోజూ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడే వారు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పొందవచ్చు. రోజుకు మూడు గ్లాసుల బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో పాటు ఇతర మూత్రపిండాల సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈ బూడిద గుమ్మడికాయల్లో నీటి శాతం ఎక్కువ. అంతేకాదు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. బూడిద గుమ్మడి కాయ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బూడిద గుమ్మడికాయ ను సౌందర్య పరంగా కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది . చర్మం నిగారింపు కు జుట్టు కోసం ,వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి, చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది.