అధిక చెమటను ఈ చిట్కాలతో నివారించండి

www.mannamweb.com


ఎండాకాలం వచ్చేసింది. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అయితే ఎండాకాలంలో కొంతమందికి చెమట ఎక్కువగా పట్టి చిరాకు పుట్టిస్తూ ఉంటుంది. అలాగే చాలా అసౌకర్యంగా అన్పిస్తుంది కూడా. అయితే ఈ సమస్యను నివారించడానికి అనేక సింపుల్ గా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంటి చిట్కాలు అధిక చెమటను నిరోధించడానికి బాగా పని చేస్తాయి. ప్రతిరోజూ ఇంట్లో తయారు చేసిన ఒక గ్లాసు తాజా టమాట జ్యూస్ తాగండి. ఇది చెమటను తగ్గిస్తుంది. వీట్‌గ్రాస్ జ్యూస్ కూడా తాగొచ్చు. ఈ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది చెమటను తగ్గిస్తుంది. అంతేకాదు వీట్ గ్రాస్ జ్యూస్ లో విటమిన్ బి 6, ప్రోటీన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 బాగా లభిస్తాయి. చెమటను తగ్గించే ఇంకో సులభమైన చిట్కా కార్న్ ఫ్లార్, బేకింగ్ సోడా కాంబినేషన్. 1/2 కప్పు కార్న్‌స్టార్చ్, 1/2 కప్పు బేకింగ్ సోడా, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని అండర్ అర్మ్స్ కు పట్టించండి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇంకా ఎండాకాలంలో వదులుగా ఉండే సౌకర్యవంతమైన బట్టలు చెమటను నివారించడంలో సహాయపడతాయి. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందుకే కాఫీ, టీలు కొంచం తక్కువగా తాగండి. ఇంకా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు, కారంగా ఉండే వంటకాలు ఎక్కువగా తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పడుతుంది.