ఏప్రిల్ నుండి ఉచిత రూ. 5 లక్షల బీమా.. వీరు మాత్రమే అర్హులు

ఆయుష్మాన్ భారత్ కార్డ్ 2025: అర్హతలు, ప్రయోజనాలు

కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వైద్య సహాయ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులు కూడా అర్హులు. ఏప్రిల్ 2025 నుంచి ఈ స్కీమ్‌ను ఉచితంగా ప్రారంభించనుంది ప్రభుత్వం.


ప్రయోజనాలు:

  • ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీం ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా.
  • ఉచిత శస్త్రచికిత్సలు, మందులు, ఇమర్జెన్సీ వైద్య సేవలు.
  • 416 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
  • ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు బిల్లులు చెల్లిస్తుంది.

ఎవరు అర్హులు?

  1. భారతదేశ పౌరులు మాత్రమే (శాశ్వత నివాసితులు).
  2. 70+ వయస్సు వృద్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. నిర్దిష్ట ఆదాయ పరిమితి (అర్బన్ & రూరల్ కుటుంబాలకు వర్తిస్తుంది).
  4. ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఉన్నవారు మాత్రమే పొందగలరు.

చికిత్సలు కవర్ అవుతాయి:

  • అన్ని ప్రాథమిక, స్పెషలిటీ వైద్య సేవలు.
  • ఇమర్జెన్సీ హాస్పిటలైజేషన్.

చికిత్సలు కవర్ కావు:

  • కాస్మెటిక్ సర్జరీ, దంత చికిత్సలు.
  • అవయవ మార్పిడి (ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్).
  • ఒబెసిటీ, మానసిక వ్యాధుల చికిత్సలు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?

  1. ఆధికారిక వెబ్‌సైట్లో రిజిస్టర్ చేయండి.
  2. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  3. ఆధార్, ఇతర దస్తావేజులు అప్‌లోడ్ చేసి వెరిఫై చేయండి.
  4. ఆయుష్మాన్ భారత్ కార్డ్ జనరేట్ అవుతుంది.

ముఖ్యమైన విషయాలు:

  • ఈ పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2025 కింద వస్తుంది.
  • ఇంతకు ముందు ప్రైవేట్ హెల్త్ ఇన్సురెన్స్ లేని వృద్ధులకు ఇది పెద్ద అవకాశం.

దరఖాస్తు చేసుకోవడానికి ఆధికారిక వెబ్‌సైట్ని సందర్శించండి.