Ayushman Card: సామాన్యులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం..

ప్రజల కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. వీటి ప్రయోజనాలు పొందాలంటే నిర్దిష్ట అర్హతలు అవసరం. పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) లేదా ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమ్‌ను లాంచ్‌ చేసింది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం లబ్దిదారులకు ఫ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తుంది.


అర్హత ఉన్న కుటుంబానికి ట్రీట్‌మెంట్, మందులు, టెస్టులకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఫ్రీ మెడికల్‌ కవరేజీ లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లొ కూడా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. అయితే అర్హులైన లబ్ధిదారులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు.

* ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న వ్యక్తులు ఆయుష్మాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్

– ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ pmjay.gov.in ఓపెన్‌ చేయండి.

– లాగిన్ చేసి, అవసరమైన వివరాలు ఎంటర్‌ చేయండి.

– మీ అప్లికేషన్‌ సబ్మిట్‌ చేసి, అప్రూవల్‌ కోసం వేచి ఉండండి.

– మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, మీ ఆయుష్మాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* ఆఫ్‌లైన్ ప్రాసెస్
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయండి. సంబంధిత అధికారిని కలిసి, అప్లికేషన్ ఫారం నింపి ఇవ్వండి. అవసరమైన డాక్యుమెంట్లు అందజేయండి. అధికారి మీ అర్హత, డాక్యుమెంట్‌లు వెరిఫై చేస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలితే, మీ ఆయుష్మాన్ కార్డ్ జనరేట్ అవుతుంది. మీరు దాన్ని తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి

– అధికారిక పోర్టల్‌ pmjay.gov.inకి వెళ్లండి.

– ‘యామ్ ఐ ఎలిజిబుల్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

– మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

– మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేయాలి. ఇప్పుడు స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ కనిపిస్తుంది, అది ఎంటర్‌ చేసి వెరిఫై చేసి, లాగిన్‌ చేయాలి.

– మీరు లాగిన్ అయినప్పుడు, మీకు రెండు ఆప్షన్‌లు వస్తాయి. మీరు మొదటి దానిలో మీ రాష్ట్రాన్ని, రెండో దానిలో మీ జిల్లాను సెలక్ట్‌ చేయాలి.

– సెర్చ్‌ చేయడానికి చాలా ఆప్షన్లు ఉంటాయి, మీ ఆధార్ కార్డును సెలక్ట్ చేస్తే, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. మీరు ఆయుష్మాన్ కార్డ్ పొందడానికి అర్హులా? కాదా? తెలుస్తుంది.

* అర్హత, అవసరమైన డాక్యుమెంట్లు
SECC 2011 డేటాలో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి. BPL లేదా AAY రేషన్ కార్డును కలిగి ఉన్నవారు అర్హులు. మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలి. మీరు ఏ ఇతర ప్రభుత్వ పథకం కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండకూడదు. ఆయుష్మాన్ కార్డును పొందడానికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటరు ID కార్డ్ అవసరం. అలానే బ్యాంక్ పాస్‌బుక్‌, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.