Baby Born Twice: రెండుసార్లు పుట్టిన ఒకే బిడ్డ.. ఆధునిక వైద్యశాస్త్రంలో అద్భుతం!

www.mannamweb.com


వైద్యశాస్త్రంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. చనిపోయిన వాళ్లు అప్పుడప్పుడు మళ్లీ బతుకుంతుంటారు. ప్రాణాంతక వ్యాధులన నుంచి ఒక్కసారిగా బయటపడతారు.

నయంకాని జబ్బులు మాయం అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా వైద్యశాస్త్రంలో ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఓ శిశువు ఒకేసారి జన్మిస్తుంది. కానీ, ఓ బిడ్డ ఏకంగా రెండుసార్లు జన్మించడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా,నిజంగా నిజం. ఒకే పాప రెండుసార్లు పుట్టడం ఏంటి? ఏ తల్లి అయినా బిడ్డకు ఒకేసారి జన్మిస్తుంది కదా? అని మీకు డౌట్ రావచ్చు. అసలు విషయం తెలియాలంటూ ఈ పూర్తి స్టోరీ చదవాల్సిందే!

కడుపులోని పిండాన్ని బయటకు తీసిన వైద్యులు

ఒకే పాప రెండుసార్లు జన్మించిన అరుదైన ఘటన అమెరికాలోని టెక్సాస్‌ చిల్ట్రన్స్ హాస్పిటల్‌ లో జరిగింది. టెక్సాస్ కు చెందిన ఓ మహిళ గర్భం దాల్చింది. అయితే, నెలలు నిండక ముందే కడుపునొప్పితో బాధపడుతూ హాస్పిటల్ కు వచ్చింది. ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఓ షాకింగ్ విషయం వెల్లడైంది. కడుపులో ఉన్న శిశువుకు ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ ట్యూమర్ ను తొలగించకపోతే, బిడ్డతో పాటు తల్లికి కూడా ముప్పు తప్పదని వైద్యులు నిర్థారణకు వచ్చారు. ట్యూమర్ తొలగించడాలంటే కడుపులోని పిండాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు.

టెక్సాస్ వైద్యులపై ప్రశంసలు

టెక్సాస్ హాస్పిటల్ లోని ప్రత్యేక వైద్యుల బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నది. కడుపులో ఉన్న పిండాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్ ను తొలగించింది. ఈ ట్యూమర్ తొలగించే సమయంలో శిశువు దాదాపు చనిపోయే అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ, ఎంతో జాగ్రత్తగా ట్యూమర్ ను రిమూవ్ చేశారు. అనంతరం ఆ పిండాన్ని గర్భంలోకి పంపించారు. సుమారు 3 నెలల తర్వాత ఆమె సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి బిడ్డను కాపాడిన టెక్సాస్ హాస్పిటల్ వైద్యులను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. రెండోసారి జన్మించిన బిడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. వైద్యశాస్త్రం లోనే ఇదో అద్భుత ఘటనగా నిలిచిపోయింది. అన్నట్లు ఈ ఘటన 2016లో జరిగింది.

2022లోనూ ఫ్లోరిడాలో ఇలాంటి ఘటన!

2022లోనూ అమెరికాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఫ్లోరిడాలోని జాడెన్‌ ఆష్లే అనే మహిళ గర్భం దాల్చింది. వైద్య పరీక్షల్లో కడుపులోని శిశువుకు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వెన్నెముక ప్రాబ్లం ఉన్నట్లు తేల్చారు. వెంటనే సర్జరీ చేయకపోతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రత్యేక వైద్యుల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 6 నెలల వయసున్న బిడ్డను తల్లిగర్భం నుంచి బయటకు తీసి వెన్నెముకకు శస్త్ర చికిత్స చేశారు. తిరిగి ఆ బిడ్డను మహిళ గర్భంలో పెట్టారు. సుమారు 3 నెలల తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలా శిశువులు రెండుసార్లు జన్మించడం వైద్యశాస్త్రంలో అద్భుతంగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.