మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బీర్‌ ధర.. ఎంతంటే

www.mannamweb.com


మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమా సెలబ్రిటీలు మొదలు, కడుపున పుట్టిన పిల్లలు చెప్పినా సరే.. మందు బాబులు మాత్రం ఈ అలవాటు మానుకోరు. పైగా ప్రభుత్వాలు కూడా మద్యపానం నిషేధంపై కఠిన చట్టాలు చేయవు. ఎందుకంటే వాటికి ప్రధాన ఆదాయ వనరు మద్యం ఆదాయమే. మందు ధరలని ఎంత పెంచినా ఎవరూ ప్రశ్నించరు. రేటు పెరిగితే తాగకు.. మానేయ్‌ అంటారు తప్ప.. ధర తగ్గించే ప్రసక్తి లేదు అంటారు. విపక్షాలు కూడా ఈ అంశంపై స్పందించవు. దాంతో అధికారంలో ఉన్న వాళ్లు మద్యం ధరలను ఎడాపెడా పెంచుతూ.. ప్రభుత్వ ఖజనాకు ఆదాయం రప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. బీర్‌ ధరను భారీగా పెంచి.. మందుబాబులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

బీర్‌ మీద ఏకంగా 20 రూపాయలు పెంచుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది మన దగ్గర కాదు.. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో. ఇప్పటికే అనేక సార్లు బీర్ల ధరలను పెంచిన కర్ణాటక ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఈసారి బీర్‌ ధరను ఏకంగా 10-20 రూపాయల వరకు పెంచింది. నెల క్రితమే బీర్‌ రేటు పెంచగా.. ఇప్పుడు తాజాగా మరోసారి పెంచింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. గత 17 నెలల్లో ఇప్పటికి 5 సార్లు బీర్‌ రేటను పెంచింది. అయితే పెరుగుతున్న ముడిసరుకు ధరలతో బీర్ తయారీ కంపెనీలపై భారీ భారం పడిందని.. ఆ ప్రభావమే ఈ ధరల పెంపు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీరు ధర సుమారు రూ.60 పెరగడం గమనార్హం.

కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీరుపై 20 శాతం అదనపు సుంకం విధించింది. దాని ఫలితంగానే బీరు ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను తట్టుకునేందుకు.. బీర్ తయారీదారులు ప్రారంభంలో.. బీర్‌ బాటిల్‌ మీద కనీసం రూ. 10 చొప్పున ధరను పెంచారు. ఇలా ఇప్పటికి మొత్తం ఐదు సార్లలో బీరు రేటు రూ.60 పెరిగింది.

కర్ణాటక ప్రభ్తువం జూన్‌ నుంచే బీరు ధరల పెంపును అమలు చేయాలని భావించింది. కానీ వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేసింది. ఇక త్వరలోనే పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఈ రేటు సవరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినప్పటికీ.. పెంచిన ధరలు ఇంకా అమలులోకి రాలేదు. అలానే ప్రభుత్వం హై-ఎండ్ బ్రాందీ, విస్కీ, జిన్ రమ్ ధరలను తగ్గించాలని.. కొన్ని ఇతర బ్రాండ్ల ధరలను పెంచాలని భావిస్తోంది.