ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ఎన్నో సూపర్ హిట్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే అదిరిపోయే టాక్ షోలు, ఆకట్టుకునే గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది ఆహా.
అలాగే పాపులర్ సింగింగ్ టాలెంట్ షో తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే రెండు సీజను కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మూడో సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అలాగే ఆహాలో అదరగొట్టిన మరో టాక్ షో అన్‌స్టాపబుల్ ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ టాక్ షోతో మొదటి సారి హోస్ట్ గా కనిపించారు. అన్‌స్టాపబుల్ షోను బాలయ్య అద్భుతంగా నడిపించారు. తన ఎనర్జీతో అభిమానులకు డబుల్ కిక్ ఇచ్చారు నటసింహం. ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. దాంతో నాలుగో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు, ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఆహా ఓటీటీ ఎన్బీకేతో అన్‌స్టాపబుల్ అనే లెజెండరీ టాక్ షోని తిరిగి తీసుకువస్తుంది. ఈ బ్లాక్‌బస్టర్ సీజన్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోసారి బాలయ్య తన హోస్టింగ్ తో అదరగొట్టనున్నారు. బాలయ్య హోస్టింగ్ ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సెలబ్రెటీల సీక్రెట్స్ బయటపెడుతూ నవ్వులు పూయించారు బాలయ్య. ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది.
ఇక ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది. అక్టోబరు 2024లో ప్రీమియర్ జరగనుంది. దసరా పండుగ రోజున అన్‌స్టాపబుల్ మొదలు కానుంది. ఇప్పటికే రణబీర్ కపూర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు హాట్ సీట్‌ను అలంకరించారు. ఇక ఇప్పుడు ముందుసీజన్స్ ను మించి ఎంటర్టైన్మెంట్ ఉండనుంది. ఈ సీజన్‌కు పాన్ ఇండియా స్టార్స్ రానున్నారని తెలుస్తోంది. ఈ టాక్ షోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ కబుర్లు, సరదా ముచ్చట్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమింగ్ తీసుకురావాలని భావిస్తున్నారట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇక బాలయ్య ల విషయానికొస్తే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ చేస్తున్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేస్తున్నారు. వీటితో పాటు పూరిజగన్నాథ్ దర్శకత్వంలోనూ ఓ చేయనున్నారు బాలయ్య.