Balineni Srinivasa Reddy : బాలినేని జంప్ ? పార్టీ మారేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం ?

www.mannamweb.com


Balineni Srinivasa Reddy Planned to join in Janasena : ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగలబొతుందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఒంగోలులో ఘోర పరాజయం చవి చూసిన మాజీ మంత్రి బాలినేని పొలిటికల్ ఫ్యూచర్‌పై లెక్కలు వేసుకుంటున్నారంట. కొడుకుతో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారంట. మూడో కంటికి తెలియకుండా ఆ దిశగా అంతర్గత చర్చలు జరుగుతున్నాయంట. ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మొదట్లోనే వ్యతిరేకించిన బాలినేని. జగన్ ఆదేశాలతో తర్వాత సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడా కోపంతోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో పడ్డారంట.

బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నేత. ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. మెన్నటి కూటమి గాలిలో టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనర్ధన్ చేతిలో మూప్పై వేల ఓట్ల తేడాలో ఘోర ఓటమిని చవిచూసారు. ఎన్నికల ముందు గ్రౌండ్ వర్క్ ఎంత చేసుకున్నా.. ఓట్లు పడక పొవడంతో పొలిటికల్ ఫ్యూచర్‌పై బాలినేని ఆలోచనలో పడ్డారంట.

ఎన్నికల టైంలో టీడీపీ కన్నా ఎక్కువ నగదు, బియ్యం బస్తాలు, మటన్ , చిక్కన్‌లు పంచారు వైసీపీ నేతలు.. వాటిని జనం బానే తీసుకున్నారు. దాంతో కనీసం వైసిపి అభ్యర్ధిగా ఉన్న బాలినేని ఐదు వేల ఓట్లతో అయినా బయట పడతానని కాన్ఫిడేంట్ గా కనిపించారు. అయితే సీన్ రివర్స్ అయింది. వైసీపీకి పక్కగా పడుతాయన్న ఓట్లే పోల్ కాలేదని అర్థమవ్వడంతో.. బాలినేని కౌంటింగ్ రోజు మూడో రౌండ్‌కే కౌంటింగ్ హల్ నుంచి వెళ్ళిపొయారు. ఇంత దారుణంగా ఓడిపోతానని ఊహించలేదని బాలినేని సన్నిహితుల వద్ద వాపోతున్నారంట.

ఒంగోలులో 20 వేల ఇళ్ళపట్టాలు పంపిణీ చేయించిన బాలినేనికి ఓటమి పెద్ద షాకే ఇచ్చింది. బాలినేని ఫాలోయర్‌గా ఉన్న ఒంగోలు మేయర్ గంగడ సుజత టీడీపీ లోకి వెళ్లడం ఖాయమైంది. ఇప్పటికే ఆమె టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల టీంతో టచ్ లో ఉన్నారంట. ఒంగోలు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లలో 43 స్థానాలు వైసీసీ గెలుచుకోగా ఒక స్థానం జనసేన మిగిలిన స్థానాలను టీడీపీ గెలిచింది. రాష్ర్టంలో అధికారం మారటంతో కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. దాంతో ఒంగోలు నగరపాలక సంస్థ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుంది. ఇదంతా బాలినేని మాస్టర్ ప్లాన్ అన్న టాక్ నడుస్తుంది.

ఏపీలో అక్కడక్కడా జరుగుతున్న గొడవలపై బాలినేని ఎక్స్ వేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన అనుమానం జనాల్లో మొదలైంది. ‘అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయం.. శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూలేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మాక ఘటనలు, అక్రమ కేసులు , భౌతిక దాడులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు’ అని బాలినేని ట్వీట్ చేశారు.