Bank Holiday: దేశవ్యాప్తంగా బ్యాంకులు 4 రోజులు బంద్.. ఎందుకో తెలుసా?

సాధారణంగా RBI ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వరంగ బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని స్థానిక పండుగలకు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.


అయితే ఈ నెల 24, 25 తేదీల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. ప్రత్యేకంగా ఈ రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాల అమలుకు గాను స్ట్రైక్ చేయనున్నారు. ఈ నేపథ్యలో బ్యాంకు యూనియన్ ప్రకటించింది. ఇండియన్స్ బ్యాంక్ అసోసియేషన్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే విషయం తెలుసుకొని బ్యాంకులకు వెళ్లాలి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెండు రోజులు సమ్మె సైరన్‌ మోగనుంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో ఐదు రోజుల్లో పని దినాలు ఇతర డిమాండ్ల సాధనకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఈ సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా మొత్తంగా పదివేల బ్రాంచ్‌ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. అయితే ఈ రెండు రోజులు కాకుండా మార్చి 22 నాలుగో శనివారం, 23వ తేదీ ఆదివారం ఈ రెండు రోజులు దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు ఎలాగో బంద్‌ ఉంటాయి. ఇవి కాకుండా 24, 25వ తేదీ సమ్మె చేయడంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. అంటే 22 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఖాతాదారులు ముందుగానే బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేయాలన్నా.. డిపాజిట్ చేయాలంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తంగా 13 డిమాండ్లు మంత్రివర్గం ముందు పెట్టింది యూఎఫ్‌బీయూ సరైన స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగనుంది.

అయితే ఎన్నో రోజులుగా బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి ఐదు రోజుల పని దినాలు ఉంటాయి కాకపోతే దీనికి గాను బ్యాంకు ఉద్యోగులు 45 నిమిషాల పాటు ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుందని వార్తలు బయటికి వచ్చాయి. కానీ అది ఇంకా అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ డిమాండ్ల నేపథ్యంలో సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు దిగనున్నారు.