బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రోజు సెలవు పొడగిస్తూ ప్రభుత్వం జీవో జారీ

www.mannamweb.com


సంక్రాంతి (14)కి సెలవు ఇవ్వగా 15న కూడా హాలిడే ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో 15న సెలవు మంజూరు చేస్తూ గతేడాది డిసెంబర్ 5న జారీ చేసిన జీవో చెంబర్ 211కు సవరణ వేసింది. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు 14, 15న రెండు రోజులు హాలిడేస్ ఉండమన్నాయి.

మీరు ఏదైనా బ్యాంకు పనికి వెళ్తున్నారా? కానీ ముందుగా ఈ బ్యాంకు సెలవుల వివరాలను తెలుసుకోండి. ఎందుకంటే జనవరి 11 బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. సెలవుల గురించి తెలియకుండా మీరు బ్యాంకుకు వెళితే, మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. బ్యాంకుల మూసివేత కారణంగా, చెక్ పుస్తకాలు, పాస్ పుస్తకాలు సహా అనేక బ్యాంకింగ్ సంబంధిత పనులు ప్రభావితమవుతాయి. కానీ ఇప్పుడు ఈ సెలవులు ఎప్పుడు ఉన్నాయో వివరాలను తెలుసుకుందాం. సంక్రాంతి రోజున బ్యాంకులకు సెలవు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులకు మరో రోజు పెంపు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే వారికి సంక్రాంతి (14)కి సెలవు ఇవ్వగా 15న కూడా హాలిడే ఇవ్వాలని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో 15న సెలవు మంజూరు చేస్తూ గతేడాది డిసెంబర్ 5న జారీ చేసిన జీవో చెంబర్ 211కు సవరణ వేసింది. ఫలితంగా బ్యాంకు ఉద్యోగులకు 14, 15న రెండు రోజులు హాలిడేస్ ఉండమన్నాయి.

ఆర్బీఐ ప్రకారం జనవరి 2025లో బ్యాంకు సెలవుల జాబితా
జనవరి 11, 2025 (శనివారం): రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జనవరి 12, 2025 (ఆదివారం): ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జనవరి 13, 2025 (సోమవారం): బోగి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు తెరిచి ఉంటాయి
జనవరి 14, 2025 (మంగళవారం): మకర సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, అస్సాం, యుపిలలో సెలవు
జనవరి 15, 2025 (బుధవారం): తిరువళ్లువర్ దినోత్సవం మరియు మాఘ బిహు పూజ కారణంగా చెన్నై, తమిళనాడులో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయి
జనవరి 16, 2025 (గురువారం): ఉజ్జవర్ తిరునల్ సెలవు సందర్భంగా చెన్నై, తమిళనాడులోని బ్యాంకులు కూడా మూసివేయబడతాయి
జనవరి 19, 2025 (ఆదివారం): ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జనవరి 23, 2025 (గురువారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులు మూసివేయబడతాయి
జనవరి 25, 2025 (శనివారం): నెలలో నాల్గవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జనవరి 26, 2025 (ఆదివారం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి

ఈ సంక్రాంతికి ముందు జనవరి 11, 12 తేదీలలో తెలుగు రాష్ట్రాల్లో సాధారణ సెలవు ఉంటుంది. జనవరి 14న మకర సంక్రాంతి సెలవు ఉంటుంది. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాల ప్రజలు సెలవు గురించి తెలుసుకుని, వారి బ్యాంకు పనులను పూర్తి చేసుకోవడం మంచిది. మరోవైపు, బ్యాంకులు మూసివేయబడినప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు కొనసాగుతాయి. నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే, సెలవు దినాల గురించి తెలుసుకుని వాటిని పూర్తి చేయండి.