నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

నవంబర్​ 1 కర్ణాటక రాజ్యోత్సవ సందర్భంగా కర్ణాటకలో, ఇగాస్​-బగ్వాల్ సందర్భంగా ఉత్తరా ఖండ్ ​లోని బ్యాంకులకు నవంబర్‌ 1న సెలవు. నవంబర్​ 2 ఆదివారం. ఇక నవంబర్​ 5 బుధవారం గురునానక్ జయంతి, కార్తిక పూర్ణిమ సందర్భంగా చాలా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవు. నవంబర్​ 7న వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు నవంబర్‌ 7న సెలవు. నవంబర్​ 8న కనకదాస జయంతి, రెండో శనివారం సందర్భంగా కర్ణాటక సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. నవంబర్​ 9 ఆదివారం. నవంబర్​ 11న లహాబ్​ డ్యూచెన్ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు హాలీ డే. నవంబర్​ 16 ఆదివారం సెలవు. నవంబర్​ 22 నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. నవంబర్​ 23 ఆదివారం సెలవు. నవంబర్​ 25న గురు తేజ్​ బహదూర్​ జీ అమర వీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్​, హరియాణా, చండీగఢ్​లలో బ్యాంకులకు సెలవు. నవంబర్​ 30న ఆదివారం సెలవు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. సో.. బ్యాంకు​లకు వెళ్లకుండానే మీ ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.