బీ కేర్‌ఫుల్‌.. వీరు బొప్పాయి అస్సలు తినకూడదు..! తింటే డేంజర్‌లో పడినట్లే​..

బొప్పాయిలో పపైన్ ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల గర్భధారణ సమయంలో గర్భాశయంలో సంకోచాలు ప్రారంభమవుతాయి. ఇవి సమయానికి ముందే ప్రసవానికి కారణమవుతాయి. కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉంది.


ప్రస్తుత రోజుల్లో చాలా మంది లేటెక్స్ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఒకవేళ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాంతో దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి కడ్నీల్లో రాళ్లు ఉన్నవారు తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే కిడ్నీల్లో రాళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బొప్పాయి అవాయిడ్ చేయడం మంచిది.

బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి.

బొప్పాయి షుగర్ రోగులకు ఎంతో ఉపయోగకరం. అయితే చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నవారు వైద్యుడి సలహాతో బొప్పాయిని తినాలి ఎందుకంటే ఇది గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.