Beauty Tips : వైరస్ క్రీములు, బ్లాక్ ఫంగస్ క్రిములు దాడి మనమీద చేయటం ద్వారా మనకు ఆరోగ్యం పట్ల రక్షణ వ్యవస్థ పట్ల చాలా శ్రద్ధ పెరిగింది కదా.. ఈరోజుల్లో అందరికీ రక్షణ వ్యవస్థ గురించి కాస్త ఎక్కువ ఆలోచన పెరిగింది.
కాబట్టి అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన పోషకాలు మన శరీరంలో రక్షక దళాలకి ఆయుధాలు లాగా పనికొస్తాయిఅన్నమాట.. అన్ని పోషకాలు కంటే నెంబర్ వన్ గా ఉపయోగపడే పవర్ ఫుల్ ఆయుధం. అన్నిటికంటే ఎక్కువగా బాడీ ఉపయోగించుకుని మరి పోషకం రక్షణ వ్యవస్థ బాగా పనిచేయటానికి వాటికి ఉపయోగపడేది విటమిన్ సి. ఇది వేడి చేస్తే నశిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కానీ వేడి చేసిన వాటిలో పూర్తిగా నశిస్తుంది. అలాంటి విటమిన్ సి బాగా ఎక్కువ ఉన్న నెంబర్ వన్ ఆహారము పెద్ద ఉసిరికాయలు.
కార్తీకమాసంలో మనందరం ఉసిరి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి దానికి పసుపు బొట్లు పెట్టి ఏదో చేస్తుంటాం కదా.. మరి ఎందుకు ఉసిరి చెట్టుకు పూజలు చేసే సంస్కృతి ప్రదర్శనలు ఎందుకు చెప్పారో తెలుసా.. మరి ఆ ఉసిరికాయలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అసలు ఎన్ని చెప్పడానికి వీల్లేదు.. అందుచేతనే ఆ ఉసిరికాయలు మన మనిషి జీవితానికి ఇంత లాభానందిస్తున్నది.. ఆ ఉసిరికాయలు అందించే ఉసిరి చెట్టుకి మనం ఏమి ఇచ్చా రుణం తీర్చుకోగలుగుతానికి కార్తీక మాసంలో దానికి ఒక నమస్కారం పెట్టే సంస్కృతి అందించారు. ఎప్పుడన్నా కావాలంటే ఉసిరికాయ ముక్కలును మార్కెట్లో అమ్ముతుంటారు. ఉప్పు లేకుండా ఎండ పెడుతుంటారు. సహజంగా వాటిని అలా ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని ముక్కల్ని కాస్త నోట్లో వేసుకుని వక్కపొడి లాగా భోజనానంతరం మూడు పూటలాముక్కలు చప్పరిస్తూ ఉండండి.
Beauty Tips of Dry Amla
ఆ ఉసిరికాయ ముక్కలు ఎండిన విటమిన్ సి నశించదు.. ఈ ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని దాన్ని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ ఒక సీసాలో ఉంచుకుని దాన్ని రోజు రెండు స్పూన్ల తీసుకొని ఒక చిన్న ప్లేట్ లో వేసేసి అందులో మూడు నాలుగు స్పూన్లు తేనె వేసేసేయండి. ఉసిరిపొడి కాంబినేషన్ అట్ల నాకండి. పది నిమిషాలు సేపట్లో నాకుతుంటే చాలా టేస్టీగా కాంబినేషన్ బాగుంటుంది. తేనె పవర్ ఫుల్ ఆంటీ బ్యాక్టీరియా ఆంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి ఉసిరికాయని పొడి రూపంలో కూడా ఇట్లా వాడండి. ఉసిరికాయ మంచిదని ఆవకాయలు మాత్రం మంచిది కాదు.. ఈ పెద్ద ఉసురికాయలుతో రోటి పచ్చళ్ళు ఇతర వాటిలన్నిటిలో వాడుకోండి. చాలా ఫ్రెష్ గా మనకు ఆయుధం మీరు అందించినట్లు అవుతుంది..