కన్నడ నాటకు చెందిన శ్రీలీల ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ లతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.
జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోల ల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. అద్భుతమైన నటిగా, డ్యాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల గొప్ప మనసున్న అమ్మాయి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటోంది. శ్రీలీల కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. కొన్ని నెలల క్రితం ఆమె మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే శ్రీలీల ఎప్పుడూ ఈ పిల్లల గురించి పెద్దగా మాట్లాడిన దాఖాలాలు లేవు. అయితే, ఆమె నటించిన లేటెస్ట్ ‘పరాశక్తి’ ప్రమోషన్ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దత్తత పిల్లల విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘నేను పిల్లలను దత్తత తీసుకోవడానికి కారణం ఒక దర్శకుడు. కన్నడలో ఒక చేసేటప్పుడు దర్శకుడు నన్ను ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. వీలు కుదిరినప్పుడల్లా అక్కడకు వెళ్లి పిల్లలతో సరదాగా గడిపేదాన్ని. అదే సమయంలో అక్కడ ఉండే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నాను. కానీ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాను. అయితే ఆ అనాథాశ్రమం నిర్వాహకులు దీన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు బయటకు చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురైనా ముందుకొస్తారు అన్నారు. వారి మాటలు నిజమేనని పించాయి. నేనేదో గొప్ప చేశానని చెప్పడం లేదు కానీ జనాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. పిల్లల ప్రస్తావన వస్తే నాకు నోటి వెంట మాటలు రావు. వాళ్లు నాతో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నాతో కలిసుండకపోయినా నేను వారిని బాగా చూసుకుంటున్నాను. నా తల్లి నన్నెంతగా ప్రేమిస్తుందో.. అదే ప్రేమను ఆ పిల్లలకు పంచుతున్నాను’ అని శ్రీలల ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.
పరాశక్తి మూవీ ప్రమోషన్లలో శ్రీలీల..
శ్రీలీల 2022లో గురు, శోభిత అనే ఇద్దరు అనాథ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకుంది. ఆ మధ్యన తన పుట్టిన రోజు సందర్భంగా మరో అమ్మాయిని దత్తత తీసుకుందని ప్రచారం జరిగింది. అయితే ఆ చిన్నారి తన మేనకోడలు అని శ్రీలీల క్లారిటీ ఇచ్చింది.


































